విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాలో క‌థానాయిక‌గా అన‌సూయ‌..!

Sun,January 27, 2019 08:40 AM
anasuya pair with tharun bhasker

హీరోగా మంచి విజ‌యాల‌తో దూసుకెళుతున్న విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రోవైపు నిర్మాత‌గా త‌న అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. నోటా అనే సినిమాతో నిర్మాత‌గా మారిన విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లో త‌న కెరీర్‌కి బీజం వేసిన ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ హీరోగా ఓ సినిమా తీయ‌నున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. త‌రుణ్‌కి ఎప్ప‌టి నుండో హీరోగా చేయాల‌నే ఇంట్రెస్ట్ ఉన్న నేప‌థ్యంలో విజ‌య్ దేవ‌రకొండ త‌న ప్రొడ‌క్ష‌న్‌లో సినిమా చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతుండ‌గా, త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని అంటున్నారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా సాగుతుందట. అయితే ఈ చిత్రంలో తరుణ్‌కి జోడిగా అనసూయని ప‌రిశీలిస్తున్నార‌ట‌. కెరీర్‌లో ఆచితూచి అడుగులేస్తూ సెల‌క్టివ్ పాత్ర‌లు ఎంచుకుంటున్న అన‌సూయ కూడా ఈ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ట‌. నాలుగు క్యారెక్టర్ల మధ్య ఈ సినిమా కథ కొనసాగుతుందని టాక్. మ‌రి దీనిపై పూర్తి క్లారిటీ ఎప్పుడొస్తుందో చూడాలి.

7126
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles