షో స్టార్ట్ కాక‌ముందే నాకు 30 ల‌క్ష‌లు ఇచ్చారు: లాస్య‌

Wed,June 26, 2019 10:53 AM
Anchor Lasya Manjunath gives clarity on bigg boss

బుల్లితెర అతి పెద్ద రియాలిటి షో బిగ్ బాస్ సీజ‌న్ 3 మ‌రి కొద్ది రోజుల‌లో ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. సీజ‌న్ 3ని నాగార్జున హోస్ట్ చేయ‌నుండ‌గా, ఇందులో పాల్గొనే కంటెస్టెంట్‌ల విష‌యంలో మాత్రం ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. కార్య‌క్ర‌మంలో పాల్గొనే సెల‌బ్రిటీల‌కి సంబంధించిన లిస్ట్ కూడా సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఇందులో కొంద‌రు తాము బిగ్ బాస్‌లో పాల్గొన‌డం లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చుకుంటున్నారు. తాజాగా యాంక‌ర్ లాస్య కూడా సోష‌ల్ మీడియా పేజ్ ద్వారా తాను బిగ్ బాస్ సీజ‌న్ 3లో పాల్గొన‌డం లేద‌ని పేర్కొంది.

కొన్నాళ్ళ క్రితం యాంక‌ర్ ర‌వితో క‌లిసి బుల్లితెర‌పై సందడి చేసిన లాస్య కొద్ది రోజుల క్రితం మంజునాథ అనే వ్య‌క్తితో ఏడ‌డుగులు వేసింది. రీసెంట్‌గా త‌ల్లి ప్ర‌మోష‌న్ కూడా అందుకుంది. ఇక బుల్లితెర‌కి కొన్నాళ్లు దూరంగా ఉన్న ఈ అమ్మ‌డు బిగ్ బాస్ కార్య‌క్ర‌మంతో లైమ్ లైట్‌లోకి రావాలని అనుకుంటుంద‌ని, ఆమెకి బిగ్ బాస్ ఆఫ‌ర్ కూడా వ‌చ్చింద‌ని సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. ఆమె ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి కంగ్రాంట్స్ చెబుతున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలో లాస్య బిగ్ బాస్ ఎంట్రీపై వివ‌ర‌ణ ఇచ్చింది . ''మీకో.. విషయం తెలుసా.. నేను బిగ్ బాస్ కి వచ్చేస్తున్నాను. షో స్టార్ట్ కాక‌ముందే బిగ్ బాస్ వాళ్లు లాస్య‌కి 30 ల‌క్ష‌ల రెమ్యున‌రేష‌న్ ఇచ్చారు. బిగ్ బాస్ లో లాస్య కన్ఫర్మ్ అయిపోయింది. అబ్బా ఇది వినడానికి ఎంత బాగుందో.. కానీ ఇదంతా అబద్దం'' అంటూ చెప్పుకొచ్చింది. తనకు ప్ర‌స్తుతం త‌న‌కి రెండున్న‌ర నెల‌ల‌ చిన్నబాబు ఉన్నాడని.. బాబుతోనే టైం సరిపోతుందని.. ఇలాంటి సమయం మళ్లీ రాదని చెప్పింది. ఈ ఏడాది పూర్తిగా బాబుతోనే గడపాలని , ఆ త‌ర్వాత వీలుంటే బిగ్ బాస్ లోకి వ‌స్తానంటూ లాస్య పేర్కొంది.

2992
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles