అల‌.. వైకుంఠ‌పుర‌ములో మ‌ల‌యాళ పోస్టర్ విడుద‌ల‌

Thu,November 7, 2019 11:44 AM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి తెలుగులోనే కాదు మ‌ల‌యాళంలోను మంచి క్రేజ్ ఉంది. ఆయ‌న న‌టించిన సినిమాల‌న్నీ దాదాపు కేర‌ళ‌లో విడుద‌లై మంచి హిట్ కొట్టాయి. తాజాగా బ‌న్నీ న‌టిస్తున్నఅల‌.. వైకుంఠ‌పుర‌ములో చిత్రాన్ని మ‌ల‌యాళంలో విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. కొద్ది సేప‌టి క్రితం మ‌ల‌యాళ వ‌ర్షెన్‌కి సంబంధించిన పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో బ‌న్నీ ప‌రిగెత్తుతున్న‌ట్టుగా స్టిల్ ఉంది. అంగు వైకుంఠ‌పుర‌త్తు అనే టైటిల్‌తో మ‌ల‌యాళ వ‌ర్షెన్ విడుద‌ల కానుండ‌గా, చిత్రం నుండి సామ‌జ‌వ‌ర‌గ‌మ‌నా అనే మ‌ల‌యాళ వర్షెన్ పాటని న‌వంబ‌ర్ 10న విడుద‌ల చేయ‌నున్నారు. ఈ పాట‌తో మ‌ల‌యాళంలోను సినిమాపై హైప్ క్రియేట్ చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. ఇప్ప‌టికే థ‌మ‌న్ స్వ‌ర రూప‌క‌ల్ప‌న‌లో రూపొందిన సాంగ్స్‌కి మంచి హైప్ వ‌చ్చిన విష‌యం విదిత‌మే. చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుంది. టబు ఓ కీలక పాత్ర చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది

1637
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles