‘అక్షర’ టీజర్ విడుదల చేసిన అనిల్ రావిపూడి

Thu,June 20, 2019 10:31 PM
anil ravipudi releases akshara Teaser


నందితా శ్వేత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అక్షర’. బి.చిన్నికృష్ణ దర్శకుడు. అహితేజ బెల్లంకొండ, సురేష్‌వర్మ అల్లూరి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్ర టీజర్‌ని దర్శకుడు అనిల్‌ రావిపూడి విడుదల చేశాడు.

ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ..‘ఒక పాత్రికేయుడు రాసే అక్షరం వేల మందిని కదిలిస్తుంది. ఒక వివేకవంతుడు రాసే అక్షరం చాలా మందికి జ్ఞానాన్ని పంచుతుంది. ఒక రచయిత తెరమీద రాసే అక్షరం చాలా మందిలో ఆలోచనలను కదిలిస్తుంది. అక్షరానికి అంత విలువ, బాధ్యత వుంది. అలాంటి అక్షరం అనే టైటిల్‌తో వస్తున్న సినిమా మంచి విలువలతో వుంటుందని నమ్ముతున్నాను. టీజర్‌ బాగుంది. ఇలాంటి చిత్రాన్ని ముందుకు తీసుకొస్తున్న నిర్మాతలకు అభినందనలు. నందితా శ్వేత మంచి నటి. ఈ సినిమాలో తన లుక్స్‌ బాగున్నాయి. నాకున్న మంచి స్నేహితులలో చిన్నికృష్ణ ఒకరన్నారు. ‘ఇప్పటి వరకు కామెడీ చిత్రాలు చేశాను. కానీ ‘అక్షర’లో ఓ సీరియస్‌ పాయింట్‌ని చర్చించాను. నా జీవితంలో ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోతుంది’ అని దర్శకుడు తెలిపారు. సందేశాత్మక చిత్రమిదని నందితా శ్వేత పేర్కొంది. ఆగస్టులో విడుదల చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు.

1490
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles