రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ గ‌బ్బ‌ర్ సింగ్ న‌టుడు

Mon,April 22, 2019 07:57 AM
Anjaneyulu met with an accident

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కించిన చిత్రం గ‌బ్బ‌ర్ సింగ్‌. ఇందులో ఓ గ్రూప్ గ్యాంగ్‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసే సంద‌డి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే గ్యాంగ్‌లో రాజ‌శేఖ‌ర్‌లా ఇమిటేట్ చేసిన ఆంజ‌నేయులు అనే న‌టుడు రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డాడు. ఇందిరా న‌గ‌ర్ ప్రాంతంలో నివ‌సించే ఆంజ‌నేయులు త‌న భార్యతో క‌లిసి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ మీదుగా గ‌చ్చిబౌలి వైపు వెళుతుండగా, వెనుక నుండి వేగంగా వ‌చ్చిన కారు ఆయ‌న బైక్‌ని డీకొట్టింది. దీంతో ఆంజనేయులు కాళ్లకు, చేతులకు గాయలయ్యాయి. ఆయ‌న భార్య కూడా స్వ‌ల్పంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌నపై జూబ్లీ హిల్స్ పోలీసుల‌కి ఆంజ‌నేయులు ఫిర్యాదు చేయ‌గా, వారు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

7545
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles