ఎన్టీఆర్ సినిమాలో మ‌రో ద‌ర్శ‌కుడు ..!

Fri,November 2, 2018 08:33 AM
another director joins to ntr movie

టాలీవుడ్‌లో ప్ర‌తిష్టాత్మకంగా తెర‌కెక్కుతున్న ఎన్టీఆర్ బ‌యోపిక్ శర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం రెండు పార్టులుగా విడుద‌ల కానుండ‌గా, ఇందులో భారీ తారాగ‌ణం పాల్గొంటున్నారు. ఎన్టీఆర్ సినిమా జీవితంతో పాటు రాజ‌కీయ జీవితాన్ని కూడా వెండితెర‌పై చూపించేందుకు క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు క్రిష్‌. అయితే ఇప్ప‌టికే చిత్రంలో ప‌లువురు ద‌ర్శ‌కుల‌ని వేరు వేరు పాత్ర‌ల కోసం ఎంపిక చేయ‌గా, మాస్ డైరెక్ట‌ర్ వివి వినాయ‌క్‌ని ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు పాత్ర కోసం ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది. త‌ర్వాతి షెడ్యూల్‌లో దాస‌రి పాత్ర పోషిస్తున్న వినాయ‌క్‌పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నుంద‌ట చిత్ర బృందం. ఈ చిత్రంలో గుమ్మడిగా .. దర్శకుడు దేవి ప్రసాద్ న‌టిస్తుంటే క్రిష్.. కేవీ రెడ్డిగా, ఎన్ శంకర్.. విఠలాచార్యగా క‌నిపించ‌నున్నారు. యన్.బి.కె.ఫిలింస్ పతాకంపై రూపొందుతున్న‌ ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా సమర్పిస్తున్నాయి. చిత్రంలో ఎన్టీఆర్‌గా బాల‌య్య , అక్కినేనిగా సుమంత్‌, హెచ్ ఎం రెడ్డిగా స‌త్య‌నారాయ‌ణ‌, శ్రీదేవిగా ర‌కుల్ , హ‌రికృష్ణగా క‌ళ్యాణ్ రామ్, బ‌స‌వ‌తార‌కంగా విద్యా బాల‌న్ , చంద్ర‌బాబుగా రానా న‌టిస్తున్న సంగతి తెలిసిందే.

3133
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles