అరుదైన ఫోటోను షేర్ చేసిన అనుపమ్ ఖేర్

Mon,August 26, 2019 12:52 PM
anupam kher shares rare photo


న్యూఢిల్లీ: బాలీవుడ్ సీనియర్ నటుడు, బీజేపీ ఎంపీ అనుపమ్ ఖేర్ తన జ్ఞాపకాలను స్మరించుకుంటూ ఓ అరుదైన ఫోటోను షేర్ చేశాడు. అది అతని వివాహం సందర్భంగా తీసినది. అనుపమ్ ఖేర్, కిరణ్ ఖేర్‌ల వివాహం జరిగి నేటికి 34 సంవత్సరాలు. తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ ఫోటోను పంచుకున్నాడు. ఈ సందర్భంగా అతను తన జీవిత భాగస్వామి కిరణ్ ఖేర్ గురించి ప్రస్తావిస్తూ.. ముప్పై నాలుగేళ్లుగా తనతో గడపడం చాలా సంతోషంగా ఉంది. నా జీవితానికి సార్థకత చేకూర్చింది నా భార్య. తన విలువైన సమయాన్ని తనకు పంచినందుకు ధన్యుడనని ఆయన అన్నారు. ఈ ఫోటోలో అనుపమ్ ఖేర్ తల్లిదండ్రులు పుష్కరీనాథ్, దుల్హరీ ఖేర్, సోదరుడు రాజు ఉన్నారు.
వీరు 1985లో వివాహం చేసుకున్నారు. ఇద్దరూ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారే. అనుపమ్‌తో పెళ్లికి ముందే కిరణ్‌కు గౌతమ్ బెర్రీ అనే బిజినెస్‌మ్యాన్ తో పెళ్లయింది. వారికి బాబు కూడా ఉన్నాడు. అనుపమ్‌తో పరిచయం అనంతరం గౌతమ్‌కు విడాకులిచ్చి వారిరువురు పెళ్లితో ఒక్కటయ్యారు.

అనుపమ్‌ఖేర్ బాలీవుడ్‌లో చాలా హిట్ సినిమాల్లో నటించాడు. అందులో దూల్హానియా లేజాయింగే, తేబాజ్, డాడీ అనే సినిమాలున్నాయి. ఆయన ఇప్పుడు కుచ్ బీ సక్తా హై అనే టాక్‌షో నిర్వహిస్తున్నారు. కాగా, అనుపమ్ ఖేర్ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంలో చండీఘడ్ ఎంపీగా ఉన్నారు.

3781
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles