నేను ఆరోగ్యంగానే ఉన్నాను.. ల‌వ్యూ ఆల్ : అనుష్క‌

Fri,June 28, 2019 08:25 AM
anushka clarity about her health

అందాల భామ అనుష్క సైరా మూవీ చిత్రీక‌ర‌ణ‌లో గాయ‌ప‌డిన‌ట్టు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే . కీల‌క‌మైన స‌న్నివేశాన్ని చిత్రీక‌రిస్తున్న స‌మ‌యంలో అనుష్క కాలికి గాయ‌మైన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. చికిత్స చేసిన వైద్యులు అనుష్క‌ని కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోమ‌ని సూచించార‌ని అన్నారు. అయితే దీనిపై అనుష్క సోష‌ల్ మీడియా ద్వారా స్పందించింది. నేను ధృఢంగా, ఆరోగ్యంగా ఉన్నాను. సియాటిల్‌లో సంతోషంగా చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్నాను. ల‌వ్యూ ఆల్ అని త‌న పోస్ట్‌లో పేర్కొంది అనుష్క‌.

కెరీర్ ప్రారంభంలో స్టాలిన్ చిత్రంలో చిరుతో క‌లిసి స్టెప్పులేసిన ఈ అమ్మ‌డు మ‌ళ్ళీ 13 ఏళ్ళ త‌ర్వాత చిరుతో న‌టిస్తుంది. మ‌రోవైపు అనుష్క నిశ్శ‌బ్ధం అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అమెరికాలో ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ప్రారంభ‌మైంది. మాధ‌వ‌న్ మ‌రో ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుష్క బధిర యువతి పాత్రలో కన్పించునున్నట్లు తెలుస్తోంది.

View this post on Instagram

😘😘

A post shared by Anushka Shetty (@anushkashettyofficial) on

1798
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles