సైరా షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ అనుష్క‌..!

Wed,June 26, 2019 12:33 PM
anushka injured in syeraa shooting

అందాల భామ అనుష్క సైరా చిత్రంలో న‌టించనుంద‌నే వార్త కొన్నాళ్ళుగా సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై ఇప్ప‌టికి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రాక‌పోయిన‌ప్ప‌టికి సామాజిక మాధ్య‌మాల‌లో అనుష్క‌కి సంబంధించి అనేక వార్త‌లు వ‌స్తున్నాయి. తాజా స‌మాచారం ప్రకారం అనుష్క సైరా మూవీ చిత్రీక‌ర‌ణ‌లో గాయ‌ప‌డింద‌ట‌. కీల‌క‌మైన స‌న్నివేశాన్ని చిత్రీక‌రిస్తున్న స‌మ‌యంలో అనుష్క కాలికి గాయ‌మైన‌ట్టు స‌మాచారం. చికిత్స చేసిన వైద్యులు అనుష్క‌ని కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోమ‌ని సూచించార‌ట‌. ఈ ఘ‌ట‌న జ‌రిగి చాలా రోజులే అవుతున్న‌ప్ప‌టికి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింద‌ని అంటున్నారు. కెరీర్ ప్రారంభంలో స్టాలిన్ చిత్రంలో చిరుతో క‌లిసి స్టెప్పులేసిన ఈ అమ్మ‌డు మ‌ళ్ళీ 13 ఏళ్ళ త‌ర్వాత చిరుతో న‌టిస్తుంది. మ‌రోవైపు అనుష్క నిశ్శ‌బ్ధం అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల అమెరికాలో మూవీ చిత్రీక‌ర‌ణ ప్రారంభ‌మైంది. మాధ‌వ‌న్ మ‌రో ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఇక సైరా విష‌యానికి వ‌స్తే సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కించిన సైరా చిత్రం ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి కాగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఈ చిత్రంలో న‌యన‌తార క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా విజ‌య్ సేతుప‌తి, సుదీప్, జ‌గ‌ప‌తి బాబు, అమితాబ్ బచ్చ‌న్‌, త‌మ‌న్నాతో పాటు ప‌లువురు స్టార్స్ ఇందులో భాగం అవుతున్నారు. ర‌త్న‌వేలు సినిమాటోగ్రాఫర్‌గా ప‌ని చేస్తున్నారు. అక్టోబ‌ర్‌లో మూవీ రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు.

1300
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles