'నిశ్శ‌బ్ధం'.. అనుష్క లుక్ విడుద‌ల‌

Wed,September 11, 2019 11:21 AM
anushka look from silence

ఎన్నో అద్భుత‌మైన చిత్రాల‌లో న‌టించి మెప్పించిన‌ అనుష్క తాజాగా నిశ్శబ్ధం అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే . హేమంత్ మధుకర్ దర్శక‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అమెరికాలో ఎక్కువ భాగం చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, ఇంగ్లీష్, హిందీ, మలయాళ భాషల్లో ఈ సంవత్సరాంతంలో భారీస్థాయిలో విడుదల కానుంది. అనుష్క పాత్ర చిత్రణ మునుపెన్నడూ లేని విధంగా వైవిధ్యంగా ఉంటుంది అని నిర్మాతలు తెలిపారు. ఆర్.మాధవన్, అంజలి, మైఖేల్‌మ్యాడ్‌సన్, షాలినిపాండే, శ్రీనివాస్ అవసరాల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా అనుష్క ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు మేక‌ర్స్ . ఇందులో అనుష్క పెయింటింగ్ వేస్తున్న‌ట్టుగా ఉంది. టైటిల్‌కి సాక్షి.. మ్యూట్ ఆర్టిస్ట్ అనే క్యాప్ష‌న్ జ‌త చేశారు. అంటే అనుష్క సాక్షి పాత్ర‌లో మూగ‌మ్మయిగా క‌నిపిస్తుందా అనే అనుమానం అభిమానుల‌లో క‌లుగుతుంది. అనుష్క పెయింటింగ్ ద్వారానే మ‌న‌సులోని మాట‌ల‌ని చెబుతుందని చెప్పుకుంటున్నారు.

1457
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles