మ‌ళ్ళీ బొద్దుగా మారిన అనుష్క‌ ..!

Wed,September 4, 2019 09:02 AM
anushka look goes viral

ఒక‌ప్పుడు నాజూకుగా ఉండే అనుష్క‌శెట్టి సైజ్ జీరో చిత్రం త‌ర్వాత బొద్దుగా మారిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత మ‌ళ్ళీ స‌న్న‌గా మారేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేసింది. బాహుబ‌లి చిత్రంలోను అనుష్క కాస్త లావుగానే క‌నిపించింది. అయితే ఇటీవ‌ల సెలబ్రిటీ ఫిట్‌నెస్ ట్రైనర్ ల్యూక్ కౌటిన్హో ఆమెను నాజూకు సుందరిగా మార్చేశారు. తెల్ల‌ని డ్రెస్‌లో స్లిమ్‌గా ఉన్న అనుష్క‌ని చూసి అంద‌రు షాక్ అయ్యారు .

తాజాగా అనుష్క కెమెరా కంట ప‌డ‌గా, ఆమె లుక్ అంద‌రికి షాక్ ఇచ్చింది. మ‌ళ్ళీ బొద్దుగా సైజ్ జీరో లుక్‌నే గుర్తు చేసింది. ప్ర‌స్తుతం అనుష్క ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్కర్లు కొడుతున్నాయి. కొద్ది రోజులుగా నిశ్శ‌బ్ధం సినిమా కోసం అమెరికాలో ఉంటున్న అనుష్క రీసెంట్‌గా హైద‌రాబాద్‌కి వ‌చ్చింది. ఆమె తాజా చిత్రం హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందుతుంది. మిగ‌తా భాష‌ల‌లో ఈ చిత్రాన్ని ‘సైలెన్స్’ పేరుతో విడుద‌ల చేయ‌నున్నారు.. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.. మాధవన్‌, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాసరావు తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించబోతున్నారు.

3273
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles