భావోద్వేగపు పోస్ట్ పెట్టిన అనుష్క‌

Sat,May 18, 2019 01:50 PM
Anushka Pens A Heartfelt Post

భాగ‌మ‌తి చిత్రం త‌ర్వాత మ‌రో సినిమా చేయ‌ని అనుష్క‌ శెట్టి త్వ‌ర‌లో సైలెన్స్ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే. ఈ అమ్మ‌డు రీసెంట్‌గా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతో భావోద్వేగంతో ఓ పోస్ట్ షేర్ చేసింది. ఇందులో త‌ను ఎంత‌గానో అభిమానించే అసిస్టెంట్ దూరం కావ‌డం క‌లచివేస్తుంద‌ని తెలిపింది. త‌న అసిస్టెంట్ ర‌వి డెత్ యానివ‌ర్సరీ సంద‌ర్భంగా అనుష్క ఎంతో ఎమోష‌న్‌గా పోస్ట్ పెట్టింది. మ‌నం ఎవ‌రినైతే ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తామో , వారు మ‌న‌ల్ని వ‌దిలి వెళితే ఆ బాధ వ‌ర్ణ‌నాతీతం . గ‌త 14 సంవ‌త్స‌రాలు చాలా ప్ర‌యాణం సాగింది. మీకు ద‌గ్గ‌ర‌గా ఉన్న వ్య‌క్తులు ఇక మీ జీవితంలో భాగం కాదు అని తెలిసినప్పుడు, వారి జ్ఞాప‌కాలు మ‌నకి దూర‌మైన‌ప్పుడు ఎంతో బాధ‌గా ఉంటుంది. నీ ఆత్మ‌కి శాంతి క‌లగాల‌ని కోరుకుంటున్నాను. చ‌నిపోయిన త‌ర్వాత ఎలాంటి జీవితం ఉంటుంద‌నే విష‌యం నాకు తెలియ‌దు. కాని నువ్వు ఎప్పుడు నా హృద‌యంలో నిలిచి ఉంటావు అని త‌న మ‌నోభావాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుంది అనుష్క‌. ఈ అమ్మ‌డు త్వ‌ర‌లో సైలెన్స్ చిత్ర షూటింగ్ కోసం అమెరికా వెళ్ల‌నుంది. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో మాధ‌వ‌న్ ముఖ్య పాత్ర పోషించ‌నున్నాడు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిలిం కార్పొరేష‌న్ సంస్థ‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. అంజలి, షాలినిపాండే ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఇది సస్పెన్స్, థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందనుందని సమాచారం.


4991
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles