హాట్ టాపిక్‌గా మారిన ప్ర‌భాస్‌, అనుష్క పెళ్లి మేట‌ర్‌..!

Mon,December 31, 2018 08:38 AM
Anushka Prabhas Wedding matter hot topic in social media

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్ అనుష్క శెట్టి, ప్ర‌భాస్ వివాహంపై కొన్నాళ్ళుగా ఇండ‌స్ట్రీలో ఆస‌క్తిక‌ర చర్చ‌లు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అనుష్క శెట్టితో ప్ర‌భాస్ వివాహం జ‌ర‌గ‌నుంద‌ని కొంద‌రు ప్ర‌చారం చేయగా, మరి కొంద‌రు ఆంధ్రా అమ్మాయిని ప్ర‌భాస్ వివాహం చేసుకుంటాడ‌ని అన్నారు. ప్ర‌భాస్ పెళ్ళికి సంబంధించి సోష‌ల్ మీడియాలో ఎన్నో పుకార్లు షికారు చేయ‌గా, వీటిని ప్ర‌భాస్ కుటుంబ స‌భ్యులు ఖండించారు. అయితే ఇప్పుడు ప్ర‌భాస్‌, అనుష్క‌ల పెళ్లి మేట‌ర్ సోష‌ల్ మీడియాలో మ‌రో సారి హాట్ టాపిక్‌గా మారింది.

తాము మొద‌టి నుండి స్నేహితుల‌మ‌నే చెబుతున్న కూడా ప్ర‌భాస్‌, అనుష్క‌ల పెళ్లికి సంబంధించిన వార్త‌ల‌కి బ్రేక్ అనేదే ప‌డ‌డం లేదు. తాజాగా ప్రభాస్‌, అనుష్క‌లు రాజ‌మౌళి త‌న‌యుడి వివాహం కోసం జైపూర్ వెళ్లిన సంగ‌తి తెలిసిందే. సంగీత్‌లో వీరిద్ద‌రు క‌లిసి ఆడిపాడిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఇక నిన్న రాత్రి జ‌రిగిన పెళ్లిలో వీరిద్ద‌రు ఒకే చోట కలిసి ఉండ‌డంతో పెళ్లిపై పుకార్లు గుప్పుమంటున్నాయి. ఫోటోల‌లో వీరిద్ద‌రు చూడ‌ముచ్చ‌ట‌గా కనిపిస్తున్నార‌ని, త్వ‌ర‌లో వీరి పెళ్లికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న చేస్తే బాగుండ‌ని అభిమానులు కోరుకుంటున్నారు. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం సాహో చిత్రంతో పాటు రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న త‌న 20వ సినిమాతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇక అనుష్క చాలా గ్యాప్ త‌ర్వాత కోన వెంక‌ట్ నిర్మాణంలో థ్రిల్ల‌ర్ మూవీ చేయ‌బోతుంది.
6869
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles