ఖ‌రీదైన కారుని సొంతం చేసుకున్న అనుష్క‌

Thu,November 22, 2018 11:33 AM

బాలీవుడ్‌లో వ‌రుస స‌క్సెస్‌ల‌తో దూసుకెళుతున్న అందాల భామ అనుష్క శ‌ర్మ‌. ఈ మ‌ధ్య ఏదో ఒక టాపిక్‌తో వార్త‌ల‌లో నిలుస్తూనే ఉంది . రీసెంట్‌గా అనుష్క‌.. త‌న భ‌ర్త‌తో క‌లిసి చేసిన యాడ్ అందరిని అల‌రించింది. ఇక షారూఖ్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన జీరో చిత్రంలో సైంటిస్ట్‌గా ఛాలెంజ్ రోల్ పోషించిన అనుష్క డిసెంబ‌ర్ 21న ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నుంది. అయితే తాజాగా ఈ అమ్మ‌డు ఓ ఖ‌రీదైన ల‌గ్జ‌రీ కానుని సొంతం చేసుకుంద‌ని బాలీవుడ్ టాక్ . ఎంతో విలాస వంతంగా ఉండే రేంజ్‌ రోవర్‌ ఆటోబయోగ్రఫీ (లాంగ్‌వీల్‌ బేస్‌) ల‌గ్జరీ కారును అనుష్క కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈ అల్టిమేట్‌ లగ్జరీ ఎస్‌యూవీ ధర సుమారు. 4కోట్ల రూపాయలు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? అనే సామెత ఈ అమ్మ‌డికి బాగానే సూట్ అవుతుంది మ‌రి. అనుష్క ఇటీవ‌ల సూయి ధాగా, మేడ్ ఇన్ ఇండియా అనే చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఇందులో అనుష్క న‌ట‌న‌కి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ల‌భించాయి.

3444
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles