ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి 14 ఏళ్ళు.. ధ‌న్య‌వాదాలు తెలిపిన అనుష్క‌

Wed,March 13, 2019 11:38 AM
anushka shetty completes 14 years in industry

ఏ పాత్ర‌లోనైన ఇట్టే ఒదిగిపోయే న‌టి అనుష్క‌. ఇటు గ్లామ‌ర్ పాత్ర‌ల‌లోను అటు ధీర‌త్వం ప్ర‌ద‌ర్శించే పాత్ర‌ల‌లోను న‌టించి ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంది అనుష్క‌. అరుంధ‌తిలో జేజెమ్మ‌గా న‌టించి జేజేలు ప‌లికించుకున్న అనుష్క బాహుబ‌లి చిత్రంలో డీ గ్లామ‌ర్ లుక్‌లో దేవ‌సేన‌గాను ఆక‌ట్టుకుంది. ఇక‌ సైజ్ జీరో కోసం భారీ బ‌రువు పెరిగిన అనుష్క త‌ను చేస్తున్న ప‌నిప‌ట్ల ఆమెకి ఎంత నిబ‌ద్ధ‌త ఉందో నిరూపించింది. చివ‌రిగా భాగ‌మ‌తి అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌కరించిన స్వీటీ ప్ర‌స్తుతం సైలెన్స్ అనే ప్రాజెక్ట్‌తో బిజీగా ఉంది. మ‌రోవైపు అయ్య‌ప్ప స్వామిపై సంతోష్ శివ‌న్ తెర‌కెక్కించ‌నున్న చిత్రంలోను అనుష్క న‌టించ‌నున్న‌ట్టు టాక్.

అనుష్క ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి 14 సంవ‌త్స‌రాలు పూర్తైన సంద‌ర్బంగా ఆమె తొలి రోజుల‌ని గుర్తు చేసుకుంటూ ఓ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. నాకు నేనుగా సినిమాల‌లోకి రాలేదు. అలా జ‌రిగిపోయింది. పూరీ జ‌గ‌న్నాథ్ గారు సూప‌ర్ సినిమాలో హీరోయిన్ కోసం చూస్తుంటే ఆయ‌న‌కి తెలిసిన ఫ్రెండ్ నా గురించి చెప్పారు. అప్పుడు పూరీ స‌ర్ ఓకే అన‌డంతో హైద‌రాబాద్‌కి వ‌చ్చాను. అలా తొలి అవ‌కాశం నాకు వ‌చ్చిందని అనుష్క అప్ప‌ట్లో ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపింది. ఆమె కెమెరాని ఫేస్ చేసి నిన్నటితో 14 సంవ‌త్స‌రాలు కావ‌డంతో ఆ ఇంట‌ర్వ్యూ వీడియోని ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. కెమెరా ముందుకు వ‌చ్చి 14 ఏళ్ళు అవుతుంది. నా కోసం ప్ర‌త్యేక స‌మ‌యం కేటాయించి న‌న్ను ఈ స్థానంలో నిలిపిన వారికి, నాగార్జున గారికి, పూరీ జ‌గ‌న్నాథ్ గారికి మ‌రియు నా అభిమానులు, నా కుటుంబం, స్నేహితులు అంద‌రికి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు అని పేర్కొంది అనుష్క‌. 2005లో వ‌చ్చిన సూప‌ర్ చిత్రంతో అనుష్క తెలుగు తెర‌కి ప‌రిచ‌యం అయిన సంగ‌తి తెలిసిందే.

2383
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles