బ‌హుభాషా చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన అనుష్క‌..!

Tue,March 12, 2019 10:24 AM
Anushka Shetty movie on lord ayyappa

ఒక‌ప్పుడు గ్లామ‌ర్ పాత్ర‌ల‌తో మెప్పించిన అనుష్క ప్ర‌స్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌లో ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తూ అల‌రిస్తుంది. చివ‌రిగా భాగ‌మతి చిత్రంతో అల‌రించిన అనుష్క త్వ‌ర‌లో సైలెన్స్ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నుంది. అయితే సైలెన్స్ అనే చిత్రం ప్ర‌స్తుతం సెట్స్ పై ఉండ‌గానే, మ‌రో ప్రాజెక్ట్‌కి ఆమె గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని అంటున్నారు. వివ‌రాలలోకి వెళితే, ఒక‌వైపు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తూనే మ‌రోవైపు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు సంతోష్ శివ‌న్‌. ఆయ‌న ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళంతో పాటు హిందీలో అయప్ప స్వామిపై చిత్రం చేయాల‌ని అనుకున్నాడ‌ట. శ్రీ గోకులం ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై గోకులం గోపాల‌న్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుండ‌గా, ఇందులో అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఆగ‌స్ట్‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నుంద‌ని అంటున్నారు. ఏఆర్ రెహ‌మాన్ చిత్రానికి సంగీతం స‌మ‌కూర్చ‌నున్నార‌ని కోలీవుడ్ టాక్. ప్ర‌స్తుతం మలయాళంలో ‘జాక్ అండ్ జిల్’ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంతోష్ శివ‌న్, ఇది పూర్తయిన వెంటనే అనుష్కతో సినిమాను పట్టాలెక్కిస్తారట‌. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న ఎప్పుడు వ‌స్తుందో చూడాలి.

1656
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles