అనుష్క బెస్ట్ లుక్ ఇదే అంటున్న కోన

Wed,December 26, 2018 08:36 AM
Anushka Shetty new look goes viral

లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కి కేరాఫ్ అడ్రెస్ అనుష్క శెట్టి. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన అరుంధతి, పంచాక్షరి, భాగమతి వంటి చిత్రాలు ఎంత పెద్ద విజ‌యం సాధించాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సైజ్ జీరో కోసం భారీ బ‌రువు పెరిగిన అనుష్క పాత లుక్‌లోకి వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది. భాగ‌మ‌తి త‌ర్వాత ఏ సినిమాకి సైన్ చేయ‌ని ఈ అమ్మ‌డు గీతాంజ‌లి చిత్రాన్ని నిర్మించి మంచి విజ‌యం సాధించిన కోన వెంక‌ట్‌తో క‌లిసి లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని చేసేందుకు సిద్ధ‌మైంది. మాధ‌వ‌న్ కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించ‌నున్నాడు అని అంటున్నారు. తెలుగు త‌మిళ భాష‌ల‌లో చిత్రాన్ని రూపొందించేందుకు కోన వెంక‌ట్ సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తుంది. తాజాగా త‌న ట్విట్ట‌ర్ ద్వారా అనుష్క అత్యుత్త‌మ లుక్ ఇదేనంటూ ఓ ఫోటో పోస్ట్ చేశాడు కోన‌వెంక‌ట్‌. ఇందులో నెమలి ఈక పట్టుకుని అనుష్క లుక్ అదిరిపోతోంది. బాహుబలి, భాగమతికి తర్వాత కథాబలమున్న పాత్రలను ఎంచుకుంటున్న దేవసేన.. కోన వెంకట్ సినిమా స్క్రిప్ట్ నచ్చడంతో ఆ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిందని అంటున్నారు.


4007
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles