సైరాతో సై అంటున్న జేజ‌మ్మ ..!

Thu,August 9, 2018 01:50 PM

కొన్ని కాంబినేష‌న్స్‌ని బ‌ట్టే సినిమా హిట్టా ఫ‌ట్టా అనేది చెప్పేయోచ్చు. మ‌రి అలాంటి కాంబినేష‌న్స్ టాలీవుడ్‌లో చాలానే ఉన్నాయి. చిరు- అనుష్క కాంబినేష‌న్ సెట్ అవుతుంది అనే వార్త బ‌య‌ట‌కి రాగానే అభిమానుల ఆనందం హ‌ద్దులు దాటింది. కొంత కాలంగా లేడి ఓరియెంటెడ్ చిత్రాల‌కే ప‌రిమిత‌మైన అనుష్క రీసెంట్‌గా భాగ‌మ‌తి చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా త‌ర్వాత తాను చేయ‌బోవు ప్రాజెక్ట్‌ని ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌క‌టించ‌లేదు. గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఏ మాయ చేశావే సీక్వెల్ చేయ‌బోతుంద‌ని వార్త‌లు వ‌చ్చిన దీనిపై క్లారిటీ లేదు. కాని తాజా స‌మాచారం ప్ర‌కారం ఖైదీ నెం 150 చిత్రంతో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చిన చిరుతో అనుష్క జ‌త‌క‌ట్ట‌నుంద‌ని అంటున్నారు.


మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం సైరా ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. వ‌చ్చే ఏడాది ఈ మూవీ విడుదల కానుంది. అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం కోసం చిరు నైట్ షెడ్యూల్‌లో కూడా పాల్గొన్నారు. ఈ మూవీ త‌ర్వాత వ‌రుస హిట్స్‌తో దూసుకెళుతున్న కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చిరు ఓ సినిమా చేయ‌నున్నారు. ఈ సినిమా సామాజిక నేప‌థ్యంలో తెర‌కెక్క‌నుండగా, ఇందులో క‌థానాయిక‌గా అనుష్క‌ని తీసుకోవాల‌ని కొర‌టాల భావించాడ‌ట‌.

మంచి సోషల్ మెసేజ్ తో తెరకెక్కనున్న చిరు 152వ చిత్రంలో మెగాస్టార్ రైతు పాత్రలో నటించనున్నారని సమాచారం. ఆయ‌న స‌ర‌స‌న అన్ని పాత్ర‌ల‌కి స‌రిగ్గా సూట‌య్యే అనుష్క అయితేనే క‌థానాయిక‌గా బాగుంటుంద‌ని కొర‌టాల భావించాడ‌ట‌. కొరటాల శివ తొలి చిత్రం ‘మిర్చి’లో అనుష్క‌కి మంచి పాత్ర సెట్ చేసిన ఈ ద‌ర్శ‌కుడు త‌ర్వాతి చిత్రం కోసం డిమాండ్ ఉన్న పాత్ర‌ని డిజైన్ చేశాడ‌ట‌. త‌న పాత్ర గురించి అనుష్క‌కి చెప్ప‌డంతో ఎగిరి గంతేసిన ఈ అమ్మ‌డు వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిందట‌. ఈ వార్తకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్ల‌నున్న‌ట్టు స‌మాచారం.

3197
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles