చిరుతో స్పెష‌ల్ సాంగ్ చేయ‌నున్న అనుష్క‌

Sun,May 5, 2019 12:13 PM
Anushka Shetty special dance in  syeraa

కొంత కాలంగా లేడి ఓరియెంటెడ్ చిత్రాల‌కే ప‌రిమిత‌మైన అనుష్క ప్ర‌స్తుతం సైలెన్స్ అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే . ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిలిం కార్పొరేష‌న్ సంస్థ‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొంద‌నున్న చిత్రంలో మాధ‌వ‌న్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాడు. అయితే సైరా చిత్రంలోను అనుష్క స్పెష‌ల్ అప్పీయ‌రెన్స్ ఇవ్వ‌నుంద‌నే వార్త అప్ప‌ట్లో దావానంలా పాకింది. తాజా స‌మాచారం ప్ర‌కారం సైరాలో అనుష్క స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించ‌నుంద‌ని అంటున్నారు. కెరీర్ ప్రారంభంలో స్టాలిన్ చిత్రంలో చిరుతో క‌లిసి స్టెప్పులేసిన ఈ అమ్మ‌డు మ‌ళ్ళీ 13 ఏళ్ళ త‌ర్వాత చిరుతో కాలు క‌ద‌ప‌నుందట‌. టాకీ పార్ట్ త‌ర్వాత `సైరాన‌ర‌సింహారెడ్డి`లో అనుష్క సాంగ్‌ను చిత్రీక‌రిస్తార‌ని టాక్. సైరా చిత్రం సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుండ‌గా, రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతాన్ని అందిస్తున్నారు. ద‌స‌రా కానుక‌గా చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు. సైరా చిత్రంలో న‌యన‌తార క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా విజ‌య్ సేతుప‌తి, సుదీప్, జ‌గ‌ప‌తి బాబు, అమితాబ్ బచ్చ‌న్‌, త‌మ‌న్నాతో పాటు ప‌లువురు స్టార్స్ ఇందులో భాగం అవుతున్నారు. ర‌త్న‌వేలు సినిమాటోగ్రాఫర్‌గా ప‌ని చేస్తున్నారు.

2542
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles