సైరా ప్రాజెక్ట్‌తో మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చిన అనుష్క‌..!

Tue,February 5, 2019 08:51 AM
anushka speecial appearnace in syeraa

కొంత కాలంగా లేడి ఓరియెంటెడ్ చిత్రాల‌కే ప‌రిమిత‌మైన అనుష్క చివ‌రిగా భాగ‌మ‌తి చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లో కోన‌వెంక‌ట్ నిర్మాణంలో ఓ సినిమా చేయ‌నుంది. అయితే సైరా చిత్రంలోను అనుష్క స్పెష‌ల్ అప్పీయ‌రెన్స్ ఇవ్వ‌నుంద‌నే వార్త ఇప్పుడు దావానంలా పాకింది.

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం సైరా ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. ద‌స‌రా కానుక‌గా ఈ మూవీ విడుదల కానుంది. అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం కోసం చిరు చాలా హార్డ్ వ‌ర్క్ చేస్తున్నారు. ఇందులో న‌యన‌తార క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా విజ‌య్ సేతుప‌తి, సుదీప్, జ‌గ‌ప‌తి బాబు, అమితాబ్ బచ్చ‌న్‌, త‌మ‌న్నాతో పాటు ప‌లువురు స్టార్స్ ఇందులో భాగం అవుతున్నారు. అయితే 2006లో చిరంజీవి న‌టించిన ‘స్టాలిన్‌’ సినిమాలో స్పెషల్‌ సాంగ్ చేసిన అనుష్క సైరాలో కీల‌క పాత్ర చేస్తుంద‌ట‌.

కీల‌క స‌న్నివేశాల‌లో అనుష్క క‌నిపిస్తుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. ఆ మ‌ధ్య కొర‌టాల శివ‌- చిరు కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న చిత్రంలో అనుష్క క‌థానాయిక‌గా ఎంపికైంద‌ని అన్నారు. మ‌రి ఈ వార్త‌ల‌లో క్లారిటీ రావాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే. సైరా చిత్రం సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో స్వాతంత్య్ర సమరయోధుడు నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతోంది . ఈ చిత్రానికి సంగీతం అమిత్‌ త్రివేది అందిస్తుండ‌గా, సినిమాటోగ్రాఫ‌ర్‌గా రత్నవేలు ఉన్నారు. పాండిచ్చేరీ దగ్గర చిత్ర షూటింగ్ జ‌రుగుతుంది.

2235
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles