చికిత్స కోసం ఆస్ట్రియాకి వెళ్లిన అనుష్క‌..!

Wed,October 10, 2018 08:13 AM

ఇటీవ‌లి కాలంలో కొందరు హీరో హీరోయిన్స్ కు సినిమాలో తాము చేసే పాత్రల పరంగా కొత్త చిక్కులు వస్తున్నాయి. అంత‌క‌ముందు హీరోలకు కానీ, హీరోయిన్లకు కానీ ఇలాంటి సమస్యలు అంతగా ఉండేవి కావు. కానీ ఇప్పుడు ఆయా నటీనటులు వారు ధరించే పాత్రలకు అనుగుణంగా శరీరం బరువు పెరగడం లేదా తగ్గించుకోవడం తప్పనిసరిగా చేసుకోవాల్సి వస్తోంది. దాంతో కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. అనుష్క శెట్టి కూడా ఆరోగ్య సమస్యతోనే బాధపడుతోందట.


సైజ్ జీరో' సినిమా కోసం బరువు పెరిగిన స్టార్ హీరోయిన్ అనుష్క, ఆ తరువాత అనుకున్న సమయానికి బరువు తగ్గలేకపోయింది. దాంతో .. పెరిగిన బరువుతోనే ఆమె 'బాహుబలి 2' .. 'నమో వెంకటేశ' .. 'సింగం 3' సినిమాలు చేసింది. అనుష్క బాగా లావుగా కనిపించిందని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. చివ‌రిగా భాగ‌మ‌తితో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన అనుష్క ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో ప్రాజెక్ట్‌కి సైన్ చేయ‌క‌పోవ‌డం టాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

సైజ్ జీరో కోసం లావెక్కిన అనుష్క ఆ తర్వాత బరువు తగ్గించుకోడానికి డైటింగ్ చేయడం, వర్కవుట్లు చేయడం చేసింది. అయితే డైటింగ్ కారణంగా ఆమెకు బ్యాక్ పెయిన్ పట్టుకుంది. బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్న అరుంధతి కేరళలో స్పా థెరపీ చికిత్స తీసుకుంద‌ని అప్పట్లో వార్త‌లు వ‌చ్చాయి. అయితే లావుగా ఉండడం వ‌ల‌న సాహో చిత్రంలో న‌టించే ఛాన్స్ మిస్ చేసుకున్న అనుష్క బరువు తగ్గేందుకు దేశవ్యాప్తంగా అనేక హెల్త్ సెంటర్స్ తిరిగి ప్రయత్నాలు చేసిందట. కానీ అవేవీ సరైన ఫలితాన్ని ఇవ్వలేదు. సహజసిద్ధమైన పద్దతుల ద్వారానే బరువు తగ్గాలని భావిస్తున్న అనుష్కకు సన్నిహితులు కొందరు సలహా ఇచ్చారట. ఆస్ట్రియాలో బరువు తగ్గేందుకు సహజసిద్ధమైన వైద్యం చేయించుకోవాలని సూచించారట. దీనితో అనుష్క ఇటీవల ఆస్ట్రియా వెళ్లినట్లు తెలుస్తోంది. మ‌రి ఇందులో నిజ‌మెంత ఉంద‌నేది తెలియాల్సి ఉంది.

5079
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles