ఆర్ఆర్ఆర్ నుండి ఈ రోజు ఏదైన స‌ర్‌ప్రైజ్ ఉంటుందా?

Thu,July 4, 2019 09:46 AM

బాహుబ‌లి చిత్రం త‌ర్వాత రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకంపై దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు.జూలై 30 .. 2020న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేలా మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆ మ‌ధ్య చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ షూటింగ్‌లో గాయ‌ప‌డ‌డం వ‌ల‌న చిత్రీక‌ర‌ణ‌కి కొద్ది రోజులు బ్రేక్ వేశారు. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లోని అల్యూమ‌నియం ఫ్యాక్ట‌రీలో రెగ్యుల‌ర్ షూటింగ్ మొదలు పెట్టారు. అయితే ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ మొద‌లై చాలా రోజులే అవుతున్న‌ప్ప‌టికి ,రాజ‌మౌళి చిత్ర ప్ర‌ధాన పాత్ర‌ధారుల లుక్స్ ఇప్ప‌టి వ‌ర‌కు రివీల్ చేయ‌లేదు. ఎన్టీఆర్ బ‌ర్త్‌డే రోజైన రాజ‌మౌళి స‌ర్‌ప్రైజ్ ఇస్తాడ‌నుకుంటే అదీ జ‌ర‌గ‌లేదు. అయితే నేడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 122వ‌ జయంతి. ఆర్ఆర్ఆర్ చిత్రంలో చెర్రీ అల్లూరి పాత్ర‌నే పోషిస్తున్నాడు కాబ‌ట్టి అల్లూరి గెటప్లో చరణ్ ఫస్ట్ లుక్‌ని రాజ‌మౌళి విడుద‌ల చేస్తాడా అని అభిమానులు ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర పోషిస్తుండ‌గా, ఆయ‌న స‌ర‌స‌న న‌టించే క‌థానాయిక ఎవ‌ర‌నే దానిపై ఇంత వ‌ర‌కు క్లారిటీ ఇవ్వ‌లేదు. ఇక చెర్రీ స‌ర‌స‌న అలియా భ‌ట్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న విష‌యం విదిత‌మే.

2244
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles