గ్రామీ వేడుక‌కు కూతురుతో క‌లిసి రెహ్మాన్‌..

Mon,February 11, 2019 02:40 PM
AR Rahman attends Grammy Awards with daughter Raheema

లాస్ ఏంజిల్స్: అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఇవాళ ఈ యేటి గ్రామీ అవార్డుల‌ను ప్ర‌దానం చేశారు. ఆస్కార్ అవార్డు గ్ర‌హీత‌, మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్‌. రెహ్మాన్ ఆ వేడుక‌లో పాల్గొన్నారు. ఆయ‌న త‌న కూతురు ర‌హీమాతో క‌లిసి ఈవెంట్‌కు వెళ్లారు. 2009లో స్ల‌మ్‌డాగ్ మిలియ‌నీర్ చిత్రానికి రెహ్మాన్‌కు గ్రామీ అవార్డు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. బ్లాక్ అండ్ గ్రే సూట్‌లో రెహ్మాన్ క‌నిపించాడు. గ్రామీ అవార్డు కార్య‌క్ర‌మానికి వెళ్లిన సంద‌ర్భంగా ఓ ఫోటోను ట్వీట్ చేశారు. లండ‌న్‌కు చెందిన ప్ర‌శాంత్ మిస్త్రీ, న్యూయార్క్‌కు చెందిన ఫాల్గుణి షా, అమెరికాకు చెందిన స‌త్నం కౌర్‌లు.. రెహ్మాన్‌తో క‌లిసి ఫోటో దిగారు. లాస్ ఏంజిల్స్‌లోని స్టేపుల్స్ సెంట‌ర్‌లో గ్రామీ అవార్డుల ప్ర‌దానం సాగింది.

1638
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles