హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న హీరో సోద‌రి

Thu,June 13, 2019 09:53 AM
AR Rahmans niece and GV Prakashs sister to make her acting debut

వెండితెర‌కి హీరో, హీరోయిన్‌ల ఫ్యామిలీకి సంబంధించిన వారు ప‌రిచ‌యం కావ‌డం కొత్తేమి కాదు. తాజాగా త‌మిళ హీరో, సంగీత ద‌ర్శ‌కుడు జీవీ ప్ర‌కాశ్ కుమార్ సోద‌రి, ఏఆర్ రెహామాన్ మేన‌కోడ‌లు భ‌వానీ శ్రీ వెండితెర‌కి ప‌రిచ‌యం కానుంది. దర్శకుడు విరుమాండి తమిళంలో విజయ్ సేతుపతి కథానాయకుడిగా ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఒక కథానాయికగా ఐశ్వర్య రాజేశ్ ను తీసుకున్నారు. మరో కథానాయికగా భవానీశ్రీని ఎంపిక చేసుకున్నారు. క పై ర‌న‌సింగం అనే టైటిల్‌తో ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. భ‌వానీ గ‌తంలో అమ‌ల అక్కినేని న‌టించిన వెబ్ సిరీస్‌లో న‌టించింది.

మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రంగా రూపొందుతున్న క పై ర‌న‌సింగంలో విజ‌య్ సేతుప‌తి, ఐశ్వ‌ర్య రాజేష్‌తో న‌టించ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. వారి నుండి చాలా నేర్చుకోవాలి అనుకుంటున్నాను అని భ‌వానీ తెలిపింది. అతి త్వ‌ర‌లో సెట్స్‌పైకి వెళ్ళ‌నున్న ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు .

6254
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles