బాలీవుడ్లో ప్రేమ, పెళ్ళిళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. కొద్ది రోజుల నుండి సిద్ధార్ధ్ మల్హోత్రా, కియారా అద్వానీ ప్రేమాయణంలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతూ వస్తుంది. దీనిపై మీడియా కియారాని ప్రశ్నించగా, తాను సింగిల్‌గానే ఉన్నట్టు తెలిపింది. సిద్ధార్ద్‌తో ప్రేమాయణం అవాస్తవం అని తెలిపింది. ఇక ఇదే విషయంపై సిద్దార్ద్ మల్హోత్రా కూడా స్పందించారు. తన జీవితం అందరకు అనుకున్నంత కలర్ఫుల్గా లేదని చెబుతూ త్వరలో కియారాతో కలిసి పని చేయబోతున్నాను అని అన్నాడు. రూమర్స్‌పై నాకు అంత అవగాహన లేదు కాని, అవే నిజమైతే బాగుంటుందని అనుకుంటున్నా అని సిద్ధార్ద్ అన్నాడు. భరత్ అను నేను', 'వినయ విధేయ రామ' చిత్రాలతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉత్తరాది భామ కియారా అద్వానీ. ప్రస్తుతం ‘కళంక్’లోని ప్రత్యేక గీతంలో నటించారు. దీంతో పాటు ‘గుడ్‌న్యూస్’ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇందులో ఆమెతోపాటు అక్షయ్ కుమార్, కరీనా కపూర్ నటిస్తున్నారు. ఇక సిద్దార్ద్ మల్హోత్రా .. షాట్‌గన్ షాది అనే చిత్రంలో నటించనున్నాడు. ఈ చిత్రం త్వరలో లక్నోలో షూటింగ్ జరుపుకోనుంది. విక్రమ్ బత్రా బయోపిక్‌లోను సిద్ధార్ద్ నటించనున్నాడు.