పెళ్లి కాకుండానే త‌ల్లి అవుతున్న బాలీవుడ్ హీరో ప్రేయ‌సి

Thu,April 25, 2019 09:02 AM
arjun rampal girl friend becomes pregnant

బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేదు. అద్భుత‌మైన చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన రాంపాల్ 24 ఏళ్ళ వ‌య‌స్సులో మెహ‌ర్ జెస్సియాని వివాహ‌మాడాడు. వీరి బంధానికి సాక్షిగా ఇద్ద‌రు కూతుళ్ళు జ‌న్మించారు. అయితే ప‌లు కార‌ణాల వ‌ల‌న గ‌త ఏడాది అర్జున్ రాంపాల్‌, మెహ‌ర్ విడాకులు తీసుకున్నారు. అప్ప‌టి నుండి సౌతాఫ్రికాకి చెందిన గాబ్రియేలాతో స‌హ‌జీవ‌నం చేస్తున్నాడు. త్వ‌ర‌లో ఆమెకి పండంటి బిడ్డ పుట్ట‌బోతుంద‌ని అర్జున్ రాంపాల్ తెలిపారు. నిండు గర్భిణిగా ఉన్న గాబ్రియేల్లాను గుండెలకు హత్తుకుని దిగిన ఫోటోని షేర్ చేస్తూ ఈ విష‌యాన్ని తెలిపాడు. పెళ్లి కాకుండానే గాబ్రియేల్లా ఓ బిడ్డ‌కి జ‌న్మ‌నివ్వ‌నుండ‌డం గ‌మ‌న‌ర్హం. 2009లో మిస్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ బాలీవుడ్‌లో పాల్గొన్న స‌మ‌యంలో అర్జున్ రాంపాల్‌తో గాబ్రియెల్లాకి ప‌రిచ‌యం ఏర్పడింది.ఆ ప‌రిచ‌యం ప్రేమ‌గా మార‌డంతో అప్ప‌టి నుండి వారిరివురు స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. కాగా, బాలీవుడ్ భామ అమీజాక్స‌న్ కూడా పెళ్లి కాకుండానే త్వ‌ర‌లో పండంటి బిడ్డ‌కి జ‌న్మ‌నివ్వ‌బోతుంది. మల్టీ మిలియనీర్ జార్జ్ పనాయిటౌతో డేటింగ్ చేస్తున్న అమీ ఈ ఏడాది జనవరిలో ఎంగేజ్‌మెంట్ జ‌రుపుకుంది. ఇటీవ‌ల జార్జ్‌తో కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ అమీ.. తాను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని తెలిపింది. అక్టోబర్‌లో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు కూడా చెప్పింది.

5727
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles