అర్జున్ రెడ్డి కాంబినేష‌న్ రిపీట్ కానుందా ?

Tue,October 15, 2019 09:08 AM

సందీప్ రెడ్డి వంగా, విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్‌లో మ‌రో చిత్రం రానుందా అంటే అవున‌నే అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు. వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన అర్జున్ రెడ్డి చిత్రం ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. హిందీలోను ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. ఇప్పుడు సందీప్, విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్‌లో మ‌రో చిత్రం రానుంద‌నే వార్త‌లు గుప్పుమంటున్నాయి. రీసెంట్‌గా జ‌రిగిన అవార్డ్ ఫంక్షన్‌లో విజయ్ దేవ‌ర‌కొండ‌ని త్వ‌ర‌లో డైరెక్ట్ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించాడు సందీప్ రెడ్డి. అయితే 2021లో ఇది జ‌ర‌గొచ్చ‌నే టాక్ వినిపిస్తుంది. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌లు సినిమాల‌తో బిజీగా ఉండ‌గా, సందీప్ రెడ్డి వంగా .. క‌బీర్ సింగ్ ప్రొడ్యూస‌ర్స్‌తో క‌లిసి మ‌రో బాలీవుడ్ చిత్రాన్ని చేస్తున్నారు. ఇందులో ర‌ణ్‌బీర్ క‌పూర్ హీరోగా న‌టిస్తార‌ని స‌మాచారం. ముందుగా ఒప్పుకున్న‌ వారి ప్రాజెక్ట్‌లు అన్నీ పూర్త‌య్యాక అర్జున్ రెడ్డి కాంబో మ‌రోసారి సెట్స్ పైకి వెళ్ల‌నున్న‌ట్టు తెలుస్తుంది.

1546
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles