స‌ల్మాన్‌ని డైరెక్ట్ చేయ‌నున్న అర్జున్ రెడ్డి డైరెక్ట‌ర్..!

Sat,June 29, 2019 10:49 AM
Arjun Reddy director to make a film with salman khan

అర్జున్ రెడ్డి వంటి రొమాంటిక్ ప్రేమ‌క‌థ‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన టాలీవుడ్ డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా. క‌బీర్ సింగ్ చిత్రంతో బాలీవుడ్ డెబ్యూ ఇచ్చిన సందీప్ ప్ర‌స్తుతం మ‌రో హిందీ చిత్రం చేసేందుకు సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తుంది. బాలీవుడ్ సూప‌ర్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో టీ సిరీస్ సంస్థ ఒ ప్రాజెక్ట్‌ని ప్లాన్ చేయ‌గా, దీనికి సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నార‌ని అంటున్నారు. ఒక‌వేళ ఈ వార్తే క‌నుక నిజ‌మైతే ఇక సందీప్‌కి వ‌రుస ఆఫ‌ర్లు రావ‌డం ఖాయ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. టాలీవుడ్‌లోను మ‌హేష్‌తో సందీప్ ఓ ప్రాజెక్ట్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. సందీప్ వంగ రీసెంట్‌గా అర్జున్ రెడ్డి రీమేక్‌గా హిందీలో క‌బీర్ సింగ్ చిత్రాన్ని చేశారు. షాహిద్ కపూర్, కియారా అద్వానీ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యం సాధించింది. ప్ర‌స్తుతం ఈ చిత్రం మంచి వ‌సూళ్ళ‌తో స‌క్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది.

2544
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles