మ‌రోసారి సంద‌డి చేసేందుకు సిద్ధ‌మైన అర్జున్ రెడ్డి జంట‌

Sat,May 11, 2019 11:00 AM
Arjun Reddy Pair Teaming Up Once Again

అర్జున్ రెడ్డి చిత్రంలో న‌టించిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌, షాలిని పాండే జంట మ‌రోసారి సంద‌డి చేసేందుకు సిద్ద‌మైంది. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్న విజ‌య్ దేవ‌రకొండ త్వ‌ర‌లో నూత‌న ద‌ర్శ‌కుడు ఆనంద్ అన్నామ‌లై ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు. మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నున్న ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామాగా రూపొంద‌నుంద‌ట‌. హీరో అనే టైటిల్‌ని చిత్రానికి ప‌రిశీలిస్తుండ‌గా, పేటా ఫేం మాళ‌విక మోహ‌న‌న్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తుంద‌ట‌. మ‌రోవైపు అర్జున్ రెడ్డి చిత్రంతో ఫుల్ ఫేమ‌స్ అయిన షాలిని పాండే కూడా ఇందులో క‌థానాయిక‌గా న‌టిస్తుంద‌ని అంటున్నారు. విజ‌య్- షాలిని కాంబినేష‌న్‌లో మ‌రో చిత్రం తెర‌కెక్క‌నుందనే స‌రికి, ఈ మూవీపై అభిమానుల‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతుంది. చిత్రంలో విజ‌య్ ప్రొఫెష‌న‌ల్ బైక‌ర్‌గా క‌నిపిస్తాడ‌ని టాక్. ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివ‌రాలు మ‌రి కొద్ది రోజుల‌లో వెల్ల‌డించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. విజ‌య్ న‌టించిన డియ‌ర్ కామ్రేడ్ చిత్రం వ‌చ్చే నెల‌లో విడుద‌ల కానుండగా, ప్ర‌స్తుతం క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

2688
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles