మార్చి 15న విడుద‌ల కానున్న 'అర్జున్ రెడ్డి'

Thu,February 28, 2019 10:16 AM
arjun reddy release on march 15

తెలుగులో హిట్ అయిన చిత్రాలు ప‌లు భాష‌ల‌లో రీమేక్ కావ‌డం లేదంటే డ‌బ్బింగ్ జ‌రుపుకోవ‌డం కామ‌న్‌గా మారింది. యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన చిత్రం ద్వార‌క త‌మిళంలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధ‌మైంది. ఈ సినిమా అనువాద పనులన్నీ పూర్తయ్యాయి. శ్రీనివాస రవీంద్ర దర్శకత్వంలో విజ‌య్ దేవ‌రకొండ‌, పూజా జ‌వేరి ప్ర‌ధాన పాత్ర‌లుగా తెర‌కెక్కిన చిత్రం ద్వార‌క‌. ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీజ్యోతి క్రియేషన్స్‌ బ్యానరుపై ఏఎన్‌ బాలాజీ తమిళంలో నిర్మిస్తున్నారు. అర్జున్ రెడ్డి టైటిల్ బాగా పాపుల‌ర్ కావ‌డంతో ఈ పేరుతో ద్వార‌క డ‌బ్బింగ్ వ‌ర్షెన్‌ని త‌మిళంలో విడుద‌ల చేస్తున్నారు. ప్రేమ, యాక్షన్‌, కమర్షియల్‌ వంటి అంశాలన్నీ కలగలిసిన సినిమాని మార్చి 15న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ఏఎన్ బాలాజీ తెలిపారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి త‌మిళంలోను భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక్క‌డ కూడా ఈ చిత్రం మంచి విజ‌యం సాధిస్తుందని బాలాజీ తెలిపారు. ద్వారక చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌, ప్రభాకర్‌, మురళీ శర్మ, సురేఖలు ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించారు. శ్యామ్‌ కె.నాయుడు సినిమాటో గ్రాఫర్‌గా వ్యవహరించారు. సాయికార్తిక్‌ సంగీతం సమకూర్చారు.

2192
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles