మాలీవుడ్‌కి అర్జున్ రెడ్డి..!

Sun,September 16, 2018 10:58 AM

ఎలాంటి అంచ‌నాలు లేకుండా సైలెంట్‌గా వ‌చ్చి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన చిత్రం అర్జున్ రెడ్డి. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, షాలిని పాండే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఇప్పుడు ఈ చిత్రం చియాన్ విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ హీరోగా వ‌ర్మ అనే టైటిల్‌తో త‌మిళంలో రీమేక్ అవుతుంది. బోల్డ్ కంటెంట్ తో సహజత్వ ప్రేమకథగా త‌మిళంలో రూపొందుతున్న ఈ సినిమాని బాల తెర‌కెక్కిస్తున్నాడు. నేష‌న‌ల్ అవార్డు విన్న‌ర్ రాజు మురుగున్ చిత్రానికి డైలాగ్స్ రాస్తున్నాడు. తెలుగులో అర్జున్ రెడ్డి చిత్రం భారీ విజ‌యం సాధించ‌డంతో త‌మిళంలోను ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇక హిందీలోను షాహిద్ క‌పూర్ హీరోగా ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళేందుకు సిద్ధ‌మైంది. తెలుగు అర్జున్ రెడ్డి తెర‌కెక్కించిన సందీప్ రెడ్డి వంగా హిందీ రీమేక్‌ని తెర‌కెక్కించ‌నున్న‌ట్టు స‌మాచారం. అయితే ఇప్పుడు మాలీవుడ్‌లో అర్జున్ రెడ్డి చిత్రం రీమేక్ అయ్యేందుకు సిద్ధంగా ఉంద‌ని తెలుస్తుంది. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించి చర్చ‌లు జ‌రుగుతుండ‌గా, త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ రానుంద‌ని అంటున్నారు. ఒక‌వేళ ఈ వార్త నిజ‌మైతే మాలీవుడ్ అర్జున్ రెడ్డి ఎవరు? అనే విషయం పై మాలీవుడ్‌లో హాట్ హాట్‌గా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.

3145
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles