అర్జున్ రెడ్డి త‌మిళ రీమేక్ టైటిల్ మారింది

Wed,February 20, 2019 08:34 AM
Arjun Reddy remake title changed

టాలీవుడ్ సెన్సేష‌న్ మూవీ అర్జున్ రెడ్డి చిత్రం త‌మిళంలో వ‌ర్మ అనే టైటిల్‌తో రూపొందిన సంగ‌తి తెలిసిందే. ఆ మూవీ ఔట్‌పుట్ అనుకున్నంత బాగా రాక‌పోవ‌డంతో ఈ సినిమాని మ‌ధ్య‌లోనే ఆపేసి త్వ‌ర‌లో ఫ్రెష్‌గా స్టార్ట్ చేస్తున్న‌ట్టు నిర్మాత‌లు ఇటీవ‌ల ప్ర‌క‌టించారు . ఈ చిత్రం ధృవ్ విక్ర‌మ్‌ ప్ర‌ధాన పాత్ర‌లోనే తెర‌కెక్క‌నుండ‌గా, ఆయ‌న స‌ర‌స‌న అక్టోబ‌ర్ చిత్ర ఫేం బానిటా సందుని ఎంపిక చేశారు. ఇక సందీప్ రెడ్డి వంగ‌ ద‌గ్గ‌ర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్ చేసిన గిరీశాయ రీమేక్‌కి ద‌ర్శ‌కుడిగా ప‌ని చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి ‘ఆదిత్యవర్మ’ అనే టైటిల్ ఫిక్స్ చేసి ధృవ్ లుక్ కూడా విడుద‌ల చేశారు. కొత్త టీంతో రేయింబవళ్లు కష్టపడి ఈ సినిమా 2019, జూన్‌లో విడుదల చేస్తాము అని నిర్మాణ సంస్థ తెలిపిన విష‌యం విదిత‌మే. ఒరిజిన‌ల్ వ‌ర్షెన్‌కి సంగీతం అందించిన ర‌ధ‌న్ ఆదిత్య వ‌ర్మ చిత్రానికి కూడా సంగీతం స‌మ‌కూర్చ‌నున్నారు. ఇక సినిమాటోగ్రాఫర్‌గా ర‌వి కె చంద్రన్ ప‌ని చేయ‌నున్నారు. రవి కె చంద్రన్ తనయుడు సంతన కృష్ణన్ అర్జున్ రెడ్డి హిందీ రీమేక్‌కి సినిమాటోగ్రఫీ అందించ‌డం విశేషం.

1787
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles