కన్న‌డ‌లో రీమేక్‌కి సిద్ధ‌మ‌వుతున్న అర్జున్ రెడ్డి

Wed,June 26, 2019 01:02 PM
Arjun Reddy to be remade in this language

ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా తెలుగులో సైలెంట్‌గా విడుద‌లై సెన్సేష‌న్ క్రియేట్ చిత్రం అర్జున్ రెడ్డి. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, షాలిని పాండే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సందీప్ రెడ్డి వంగా తెర‌కెక్కించిన ఈ చిత్రం హిందీ, త‌మిళ భాష‌ల‌లో రీమేక్ అయిన సంగ‌తి తెలిసిందే. త‌మిళంలో ఆదిత్య వ‌ర్మ పేరుతో రీమేక్ అవుతున్న ఈ చిత్రం హిందీలో క‌బీర్ సింగ్ పేరుతో రూపొందింది. క‌బీర్ సింగ్ చిత్రం రీసెంట్‌గా విడుద‌ల కాగా ఈ చిత్రానికి భారీ ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. అమెరికాలో ఈ సినిమాకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. దీంతో రెండో వారం నుంచి (జూన్‌ 28న) 45 సెంటర్లను పొడిగించారు. విదేశాల్లోనూ ఈ సినిమా విశేషమైన వసూళ్లు రాబడుతోందని విశ్లేషకులు వెల్లడించారు. క‌ట్ చేస్తే ఇప్పుడు అర్జున్ రెడ్డి చిత్రాన్ని క‌న్న‌డ‌లోను రీమేక్ చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. ప్ర‌ముఖ ఫిలిం మేక‌ర్ ఎస్‌.నారాయ‌ణ్ రీసెంట్‌గా అర్జున్ రెడ్డి రీమేక్ రైట్స్ ద‌క్కించుకోగా అతి త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌ని మొద‌లు పెట్ట‌నున్నార‌ట‌. అంతేకాక ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి డీటైల్స్‌ని త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నార‌ట‌.

1234
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles