బాలీవుడ్ ఈవెంట్‌లో మెరిసిన టాలీవుడ్ యంగ్ హీరో

Sat,March 30, 2019 11:50 AM
Arjun Reddy Vijay Deverakonda met Kabir Singhs Preeti

టాలీవుడ్ యంగ్ సెన్సేష‌న్ విజ‌య్ దేవ‌ర‌కొండ అతి త‌క్కువ టైంలో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. విజ‌య్‌కి కేవ‌లం తెలుగులోనే కాక త‌మిళం, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల‌లోను అభిమానులు ఉన్నారు. తాజాగా ఆయ‌న ముంబైలో జ‌రిగిన హిందుస్థాన్‌ టైమ్స్‌ ఇండియాస్‌ మోస్ట్ స్టైలిష్ అవార్డ్స్‌ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి షారూఖ్ దంప‌తుల‌తో పాటు బాలీవుడ్ స్టార్స్ అక్ష‌య్ కుమార్, ర‌ణ‌వీర్ సింగ్‌, క‌రీనా క‌పూర్‌, క‌త్రినా కైఫ్‌, కియారా అద్వానీ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో విజ‌య్ దేవ‌ర‌కొండ హాటెస్ట్ స్టైలిస్ట్ అవార్డు అందుకున్నారు. ఆ త‌ర్వాత కియారా అద్వానీతో క‌లిసి ఓ ఫోటో దిగారు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రి ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. కియారా అద్వానీ ప్ర‌స్తుతం హిందీలో రూపొందుతున్న అర్జున్ రెడ్డి రీమేక్ చిత్రం క‌బీర్ సింగ్‌లో కథానాయికగా న‌టిస్తుంది. ఈ మేర‌కు నెటిజ‌న్స్ అర్జున్ రెడ్డితో బాలీవుడ్ ప్రీతి అని కామెంట్స్ పెడుతున్నారు. తెలుగు అర్జున్ రెడ్డి చిత్రంలో షాలిని పాండే ప్రీతి అనే పాత్ర‌లో న‌టించిన విష‌యం విదిత‌మే.

View this post on Instagram

When Preeti met Arjun @thedeverakonda 😎

A post shared by KIARA (@kiaraaliaadvani) on

2664
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles