పోర్చుగల్ లో కీలక షెడ్యుల్ ప్లాన్ చేసిన అర్జున్ రెడ్డి టీం

Sun,April 7, 2019 08:50 AM
Arjun Reddys Tamil remake heads to Portugal

టాలీవుడ్ సెన్సేష‌న్ మూవీ అర్జున్ రెడ్డి చిత్రం త‌మిళంలో వ‌ర్మ అనే టైటిల్‌తో బాల దర్శకత్వంలో కొంత బాగం తెరకెక్కిన సంగ‌తి తెలిసిందే. ఆ మూవీ ఔట్‌పుట్ అనుకున్నంత బాగా రాక‌పోవ‌డంతో ఈ సినిమాని మ‌ధ్య‌లోనే ఆపేసి, సందీప్ రెడ్డి వంగ‌ ద‌గ్గ‌ర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్ చేసిన గిరీశాయ దర్శకత్వంలో రీమేక్‌ చేస్తున్నారు. ‘ఆదిత్యవర్మ’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బ్రేక్ పడిందని పుకార్లు షికారు చేశాయి, కానీ తాజా సమాచారం ప్రకారం చిత్ర యూనిట్ ఏప్రిల్ 9 న కీలక షెడ్యుల్ కోసం పోర్చుగల్ వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ఈ షెడ్యుల్ లో కొన్ని సన్నివేశాల తో పాటు ఓ సాంగ్ చిత్రీకరించనున్నట్టు టాక్. 2019, జూన్‌లో ఈ విడుదల చేస్తాము అని నిర్మాణ సంస్థ తెలిపిన విష‌యం విదిత‌మే. ఒరిజిన‌ల్ వ‌ర్షెన్‌కి సంగీతం అందించిన ర‌ధ‌న్ ఆదిత్య వ‌ర్మ చిత్రానికి కూడా సంగీతం స‌మ‌కూర్చ‌నున్నారు. ఇక సినిమాటోగ్రాఫర్‌గా ర‌వి కె చంద్రన్ ప‌ని చేయ‌నున్నారు. ధృవ్ విక్ర‌మ్‌ స‌ర‌స‌న అక్టోబ‌ర్ చిత్ర ఫేం బానిటా సందు హీరోయిన్ గా నటిస్తుంది.

2114
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles