అర్జున్ సుర‌వరం మ‌రోసారి వాయిదా.. ఫీల‌య్యానంటున్న నిఖిల్

Fri,April 26, 2019 08:30 AM
Arjun Suravaram movie release date changed

యంగ్ హీరో నిఖిల్‌కి అదృష్టం క‌ల‌సి రావ‌డం లేదు. ఎప్పుడో విడుద‌ల కావ‌ల‌సిన త‌న తాజా చిత్రం అర్జున్ సుర‌వ‌రం మ‌రోసారి వాయిదా ప‌డింది. అవెంజ‌ర్స్ దెబ్బ‌కి మ‌రోసారి త‌న సినిమాని వాయిదా వేసుకున్నాడు నిఖిల్. ఇది బాధాక‌రం అయిన‌ప్ప‌టికి డ‌బ్బులు పెట్టి కొనుకున్న డిస్ట్రిబ్యూట‌ర్ నిర్ణ‌యాన్ని గౌర‌విస్తూ ఈ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్న‌ట్టు నిఖిల్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపాడు. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న మజిలీ, చిత్ర లహరి, జెర్సీ సినిమాలు మంచి వసూళ్లు సాధిస్తుండటం, అవెంజర్స్‌ ఎండ్ గేమ్‌పై భారీ అంచ‌నాలు ఉండ‌డంతో ఈ టైంలో సినిమాని విడుద‌ల చేయ‌డం మంచిది కాద‌ని టీం భావించింద‌ట‌. మ‌హేష్ న‌టించిన మ‌హ‌ర్షి చిత్రం మే 9న విడుద‌ల కానుండ‌గా, ఈ మూవీ త‌ర్వాత అర్జున్ సుర‌వరం చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌.

యంగ్ హీరో నిఖిల్‌, అందాల భామ లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో టి.ఎన్. సంతోష్ తెర‌కెక్కించిన చిత్రం అర్జున్ సుర‌వరం. బి.మధు (ఠాగూర్ మధు) సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్ఎల్‌పి, ఔరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై రాజ్ కుమార్ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మార్చి లోనే విడుద‌ల కావ‌ల‌సి ఉన్న ఈ చిత్రం ప‌లు కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డింది. ముద్ర అనే టైటిల్‌ని ముందుగా ఈ చిత్రానికి ఫిక్స్ చేశారు. కాని అదే పేరుతో జ‌గ‌ప‌తి బాబు చిత్రం విడుద‌ల కావ‌డంతో పేరు మార్చి అర్జున్ సుర‌వ‌రం పేరుతో చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. మేడే సంద‌ర్భంగా మే 1న మూవీని రిలీజ్ చేద్దామ‌నుకున్న‌ప్ప‌టికి అది వీలు కావ‌డం లేదు. శ్యామ్ సీఎస్ చిత్రానికి స్వ‌రాలు స‌మ‌కూర్చారు. త‌మిళంలో సూప‌ర్ సక్సెస్ అందుకున్నక‌నిత‌న్‌కి రీమేక్‌గా అర్జున్ సుర‌వ‌రం చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో నిఖిల్ జ‌ర్నలిస్ట్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, తరుణ్ అరోరా, సత్య, నాగినీడు ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు.1253
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles