త‌మ‌న్నా స్థానంలో అవికా ఎంట్రీ ఇవ్వ‌డానికి కార‌ణం ఇదే..!

Sun,October 13, 2019 08:44 AM

రాజుగారి గ‌ది ఫ్రాంచైజీలో వ‌చ్చిన రెండు చిత్రాలు మంచి విజ‌యం సాధించడంతో రాజుగారి గ‌ది 3 చిత్రాన్ని తెర‌కెక్కించాడు ఓంకార్. ఇందులో త‌మ‌న్నాని క‌థానాయిక‌గా ఎంపిక చేశాడు. సినిమా లాంచింగ్ కార్య‌క్ర‌మంలోను పాల్గొన్న ఈ అమ్మ‌డు ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే త‌మ‌న్నా ఆ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకోవ‌డానికి గ‌ల కార‌ణాన్ని అశ్విన్ బాబు ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మంలో తెలియ‌జేశాడు.


డేట్స్ అడ్జెస్ట్ కాని కారణంగా త‌మ‌న్నా రాజుగారి గ‌ది3 నుండి తప్పుకున్నారు. రెండు షెడ్యూల్స్ లేట్ కావ‌డం, అక్టోబర్ విడుదల పెట్టుకోవడంతో ఇంకా తమన్నా కోసం వేచి చూస్తే బాగోదని ఆమె స్ధానంలో అవికా గోర్‌ని తీసుకున్నాం. ఈ సినిమాకు చాలా పెద్ద ప్లస్ అయింది. అవికా గోర్ ఎక్స్‌ట్రార్డినరీగా చేసింది. చాలా రోజుల తర్వాత తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తుంది. కచ్చితంగా అలరిస్తుంది ఆమె కారెక్టర్’’ అని అశ్విన్ తెలిపాడు. అశ్విన్‌ బాబు హీరోగా నటిస్తున్న ఈసినిమాలో ఊర్వశి, అలీ, బ్రహ్మాజీ, హరితేజ, ప్రభాస్‌ శ్రీను, అజయ్‌ ఘోష్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఓంకార్ స్వీయ నిర్మాణంలో రూపొంద‌నున్న ఈ చిత్రానికి బుర్రా సాయి మాధవ్ చిత్రానికి డైలాగ్స్ అందిస్తుండ‌గా, చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేస్తున్నారు.

3647
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles