ఈ వారం ఇంటి నుండి వెళ్లిపోయేది ఎవ‌రో తెలుసా?

Sun,August 25, 2019 08:13 AM
Ashu Reddy Eliminated from the  BiggBoss3 Telugu

16 మంది స‌భ్యుల‌తో మొద‌లైన బిగ్ బాస్ సీజ‌న్ 3 కార్య‌క్ర‌మం స‌క్సెస్‌ఫుల్‌గా ఐదువారాలు పూర్తి చేసుకుంది. తొలి వారంలో హేమ ఎలిమినేట్ కాగా, రెండో వారంలో జాఫ‌ర్‌, మూడో వారంలో త‌మ‌న్నా, నాలుగో వారంలో రోహిణి ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌నే ఆస‌క్తిక‌ర చ‌ర్చ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో జోరుగా జ‌రుగుతుంది. నామినేష‌న్‌లో బాబా భాస్క‌ర్, రాహుల్‌, అషూ రెడ్డి, హిమ‌జ‌, పున‌ర్న‌వి ఉండ‌గా వీరిలో వీక్ కంటెస్టెంట్ అషూ అనే చెబుతున్నారు. ఐదో వారం అషూనే ఇంటి నుండి వెళ్ళిపోయే వ్య‌క్తి అని నెటిజ‌న్స్ జోస్యాలు చెబుతున్నారు. మొద‌టి నుండి హౌజ్‌లో పెద్ద‌గా ప‌ర్‌ఫార్మెన్స్ క‌న‌బ‌ర‌చని అషూకి త‌క్కువ ఓట్స్ రావ‌డంతో ఈ రోజు ఇంటి నుండి వెళ్ల‌బోయే వ్య‌క్తి అషూ అని జోరుగా ప్ర‌చారం జరుగుతుంది. మ‌రి నెటిజ‌న్స్ గెస్సింగ్ ప్ర‌కారం అషూనే ఇంటి నుంచి బయటకు వెళ్లిందా? లేదా అన్నది తెలియాలంటే మ‌రి కొద్ది గంట‌లు ఆగ‌క త‌ప్ప‌దు.అయితే బిగ్ బాస్‌కి సంబంధించి మ‌రో వార్త కూడా వైర‌ల్‌గా మారింది. ప్ర‌స్తుతం హౌజ్‌లో 12 మంది స‌భ్యులు ఉండ‌గా,అషూ వెళ్లిపోతే 11 మంది ఉంటారు. ఈ క్ర‌మంలో మ‌రో వ్య‌క్తిని వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇంట్లోకి పంపే అవ‌కాశం ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఈషారెబ్బా, హెబ్బా పటేల్‌, శ్రద్దా దాస్ ల‌లో ఎవ‌రో ఒకరు బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్ట‌నున్నార‌ని చెబుతున్నారు. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో

3652
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles