ఆన్‌లైన్‌లో అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్ మూవీ..! చైనీయుల ప‌నే..?

Thu,April 25, 2019 03:54 PM
avengers end game movie pirated copy appeared online

మార్వెల్ సినిమాటిక్ యూనివ‌ర్స్ లో వ‌స్తున్న చిట్ట చివ‌రి చిత్రం.. అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్‌.. రేపు ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానున్న విష‌యం విదిత‌మే. భార‌త్‌లో ఈ సినిమా హిందీ, తెలుగు, త‌మిళ భాష‌ల్లోనూ రిలీజ్ అవుతున్న‌ది. కాగా ఈ సినిమాకు చెందిన పైరేటెడ్ ప్రింట్ ఇప్ప‌టికే ఆన్‌లైన్‌లో ద‌ర్శ‌మిస్తున్న‌ది.

అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్ సినిమాకు గాను నిన్న అమెరికా, చైనా స‌హా ప‌లు యూర‌ప్ దేశాల్లో ప్రీమియ‌ర్ షోల‌ను వేశారు. అయితే చైనాలో స‌ద‌రు ప్రీమియ‌ర్ షో వేసిన ఓ థియేట‌ర్‌లో ఈ సినిమాను కొంద‌రు కెమెరాతో రికార్డ్ చేశార‌ట. అనంత‌రం వారు టోరెంట్ సైట్ల‌లో ఈ సినిమాను అప్‌లోడ్ చేశార‌ట‌. ఇప్ప‌టికే ఈ సినిమా పైరేటెడ్ కాపీ ప‌లు టోరెంట్ సైట్ల‌లో ద‌ర్శ‌న‌మిస్తున్న‌ది. కాగా సినిమా పైర‌సీ ప‌ట్ల చిత్ర న‌టుడు రాబ‌ర్ట్ డౌనీ జూనియ‌ర్ స్పందించారు. అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్ మూవీ పైరేటెడ్ కాపీ చూసిన వారు సైలెంట్‌గా ఉండాల‌ని, ఇత‌రుల‌కు ఆ సినిమాను చూపించి దాన్ని స్పాయిల్ చేయ‌వ‌ద్ద‌ని రాబ‌ర్ట్ డౌనీ ట్వీట్ చేశారు. కాగా సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్ మాత్రం తాము సినిమాను థియేట‌ర్‌లోనే చూస్తామ‌ని, పైర‌సీని ఎట్టిప‌రిస్థితిలోనూ ప్రోత్స‌హించేది లేద‌ని తేల్చి చెబుతున్నారు.1766
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles