అవెంజర్స్ ఐరన్ మ్యాన్ మళ్లీ వస్తున్నాడు..!

Tue,September 17, 2019 12:54 PM

గత కొద్ది నెలల కిందట విడుదలైన అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీ సినీ ఇండస్ట్రీలో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అవతార్ బాక్సాఫీస్ రికార్డులను ఆ మూవీ బద్దలు కొట్టింది. అయితే అందులో ఐరన్ మ్యాన్ పాత్రను చంపేశారని అందరికీ తెలుసు. కానీ ఐరన్ మ్యాన్ మరోసారి మనకు వెండితెరపై కనిపించనున్నాడు. అయితే ఆ పాత్ర మళ్లీ వస్తుందా..? అంటే.. కాదు.. ఎందుకంటే.. ఐరన్ మ్యాన్ కనిపించనున్నది.. అవెంజర్స్ ప్రీక్వెల్ మూవీలో..!


అవెంజర్స్‌లో ఒకరైన బ్లాక్ విడో మూవీని మార్వెల్ స్టూడియోస్ 2020 మే1వ తేదీన విడుదల చేయనున్న విషయం విదితమే. అందులో ఐరన్ మ్యాన్ కొద్ది నిమిషాల పాటు కనిపించనున్నాడని తెలిసింది. అయితే నిజానికి అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీలో బ్లాక్ విడోతోపాటు ఐరన్ మ్యాన్ ఇద్దరూ చనిపోతారు. కానీ త్వరలో వస్తున్న బ్లాక్ విడో మూవీ మాత్రం 2016లో వచ్చిన కెప్టెన్ అమెరికా సివివ్ వార్ తరువాత నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తీసినది. దీంతో అవెంజర్స్ మూవీలకు బ్లాక్ విడో మూవీ ప్రీక్వెల్‌గా ఉంటుంది. కనుకనే మనకు ఐరన్ మ్యాన్ మరోసారి కనిపించనున్నాడు. కాగా ఐరన్ మ్యాన్ పాత్రలో ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్ అలరిస్తుండగా.. బ్లాక్‌విడో పాత్రలో స్కార్లెట్ జొహాన్సన్ నటిస్తోంది.

1153
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles