క్యాన్సర్‌పై స్టార్ హీరో భార్య భావోద్వేగ సందేశం

Mon,February 4, 2019 02:59 PM
Ayushman Khurranas wife Tahira Kashyap posted an emotional message on World Cancer Day

క్యాన్సర్.. మారుతున్న జీవనశైలి కారణంగా ఈ మహమ్మారి చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా అందరిపై దాడి చేస్తున్నది. ఈ మధ్య కాలంలో క్యాన్సర్ బారిన పడిన సెలబ్రిటీలను కూడా ఎంతో మందిని మనం చూశాం. బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా, క్రికెటర్ యువరాజ్‌సింగ్ ఈ క్యాన్సర్‌ను జయించిన వాళ్లే. ఈ మధ్య బాలీవుడ్ నటులు సొనాలీ బింద్రే, ఇర్ఫాన్‌ఖాన్‌లాంటి వాళ్లు కూడా ఈ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నారు. తాజాగా అంధాధున్, బదాయి హోలాంటి సూపర్‌హిట్ బాలీవుడ్ మూవీస్‌తో స్టార్ హీరోగా మారిన ఆయుష్మాన్ ఖురానా భార్య తాహిరా కశ్యప్ కూడా రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నది. ఇప్పటికే ఆమె క్యాన్సర్ చికిత్స కూడా తీసుకుంటోంది. అయితే సోమవారం వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఆమె ట్విటర్‌లో పోస్ట్ చేసిన ఓ భావోద్వేగ సందేశం క్యాన్సర్ బాధితుల్లో నైతిక ైస్థెర్యాన్ని నూరిపోసేలా ఉంది. ఇవాళ నా రోజు. అందరికీ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఈ రోజును ఘనంగా జరుపుకోవాలి. ఈ వ్యాధిపై ఉన్న అపోహను మనం ముందు తొలగించుకోవాలి. అందుకే ఈ ఫొటోను పోస్ట్ చేస్తున్నాను. నా ఒంటిపై ఉన్న ఈ క‌త్తిగాట్లు ఓ గౌర‌వ చిహ్నంగా భావిస్తున్నాను. నేను రోగాన్ని కాకుండా దానిని ధైర్యంగా ఎదుర్కొన్న తీరును చెప్పడానికి ఈ ఫొటోను పోస్ట్ చేశాను అని తాహిరా ఓ సందేశాన్ని ట్వీట్ చేసింది. ఆమె ఈ మధ్యే లాక్మె ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ వాక్ కూడా చేయడం విశేషం.
2954
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles