స్పెల్లింగ్ మిస్టేక్ అంటూ విమర్శలు.. వచ్చిన క్లారిటీ

Tue,January 23, 2018 09:50 AM
ba raju gives clarity on intelligent title issue

మెగా హీరో సాయి ధరమ్ తేజ్, మాస్ డైరెక్టర్ వివి వినాయక్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ఇంటిలిజెంట్. నిన్న సాయంత్రం మూవీ టీం చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేసింది. అయితే రెండు రోజుల క్రితమే ఫస్ట్ లుక్ విడుదల టైం చెబుతూ ప్రీ లుక్ రిలీజ్ చేయగా, ఇందులో టైటిల్ లోగో క్రింద ఇంగ్లీష్ టైటిల్ ‘INTTELLIGENT’ గా ఉంది. అసలు ‘INTELLIGENT’ స్పెల్లింగ్ ఇది కాగా, టైటిల్ లో తప్పుగా రాశారంటూ నెటిజన్స్ విమర్శలు కురిపించారు. దీనిపై బీఏ రాజు వెంటనే తన ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. అది స్పెల్లింగ్ మిస్టేక్ కాదు. న్యూమరాలజీ ప్రకారం ‘INTELLIGENT’ ని ‘INTTELLIGENT’ గా రాశారని వివరణ ఇచ్చారు. దీంతో నెటిజన్స్ శాంతించారు. ఇంటిలిజెంట్ చిత్రంలో తేజూ సరసన లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తుంది. థమన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఫిబ్రవరి 9న మూవీ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.1574
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles