బాహుబ‌లి2తో పాటు మామ్ చిత్రానికి ద‌క్కిన అరుదైన గౌర‌వం

Tue,January 9, 2018 11:28 AM
baahubali 2 and mom screened at indian film festival

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన దృశ్య కావ్యం బాహుబ‌లి2 చిత్ర ప్ర‌భంజ‌నం కొన‌సాగుతూనే ఉంది. ఈ మూవీ విడుద‌లై దాదాపు ఏడాది కావొస్తున్నా ఈ సినిమా ఇంకా అందరి నోళ్ళ‌ల్లో నానుతూనే ఉంది. వార్త‌ల‌లో నిలుస్తూనే ఉంది. ఇటీవ‌ల‌ హాలీవుడ్ లో పాపులర్ వెబ్ సైట్ అయిన‌ రొటెన్ టమాటాస్ 2017 లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన వేలాది సినిమాల్లో బాహుబలికి రెండోస్థానం ఇచ్చింది. ఇక వికీపీడియా 2017లో ప్ర‌పంచ వ్యాప్తంగా ఎక్కువ మంది చదివిన ఆర్టిక‌ల్స్‌కి సంబంధించిన జాబితాని విడుద‌ల చేసింది. ఇందులో 1.46 కోట్ల వ్యూస్‌తో ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ పదకొండో స్థానాన్ని సొంతం చేసుకుంది. తాజాగా బాహుబ‌లి 2 చిత్రం ఆర్మేనియా రాజధాని ఎరవాన్‌లో నిర్వహించనున్న ‘ఇండియన్‌ ఫిల్మ్స్‌ ఫెస్టివల్‌’లో ప్ర‌ద‌ర్శితం కానుంది. ఈ మూవీతో పాటు శ్రీదేవి న‌టించిన మామ్‌, ఇర్ఫాన్‌ ఖాన్‌ ప్రధాన పాత్ర పోషించిన ‘హిందీ మీడియం’ సినిమాలు ప్ర‌త్యేక ప్ర‌ద‌ర్శ‌న జరుపుకోనున్నాయి. రిప‌బ్లిక్ డే రోజు ఈ వేడుక జ‌ర‌గ‌నుంది. మామ్ చిత్రానికి ద‌క్కిన అరుదైన గౌర‌వానికి శ్రీదేవి భ‌ర్త బోనీ క‌పూర్ ఆనందం వ్య‌క్తం చేశారు ‘మామ్‌’ సినిమా ఇప్పటికే యూకే, యూఎస్‌, రష్యా, పొలాండ్‌, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, సింగపూర్‌ దేశాల్లో విడుదల కాగా, ఇప్పుడు ఎర‌వాన్‌లో ప్ర‌ద‌ర్శితం కానుండడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్య‌క్తం చేసింది. ఇక సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న బాహుబ‌లి చిత్రం త్వ‌ర‌లో జ‌పాన్, చైనాతో పాటు ప‌లు దేశాల‌లో విడుద‌ల‌కి సిద్ధంగా ఉంది.

2914
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles