సైమాలో బాహుబ‌లి 2కి అవార్డుల పంట‌

Sat,September 15, 2018 10:52 AM

ద‌క్షిణాది తార‌లంతా ఒకే చోట చేరి సంద‌డి చేసే ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ సైమా (సౌత్ ఇండియ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ అవార్డ్స్ ) వేడుక ప్ర‌తి సంవ‌త్స‌రం అంగ‌రంగ వైభవంగా జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల‌కి సంబంధించిన సెల‌బ్రిటీలు ఈ వేడుక‌కి హాజ‌రు కానున్నారు. న‌టీమ‌ణుల గ్లామ‌ర్ తో , రాక్ ప‌ర్ఫార్మెన్స్ తో, సెల‌బ్రిటీల ఆట పాట‌ల‌తో సైమా వేడుక ఘ‌నంగా జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆరు ఎడిష‌న్స్ పూర్తి చేసుకున్న సైమా ఈ ఏడాది దుబాయ్‌లో ఏడో ఎడిష‌న్ జ‌రుపుకుంటుంది. సెప్టెంబ‌ర్ 14, 15వ తేదీల‌లో సైమా వేడుకని ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు నిర్వాహ‌కులు . తొలి రోజు టాలీవుడ్‌, కోలీవుడ్ ప‌రిశ్ర‌మ‌ల‌కి సంబంధించిన విజేత‌ల‌ని ప్ర‌క‌టించారు. 2017 సంవ‌త్స‌రంలో విడుద‌లైన చిత్రాల‌కి సంబంధించి ఈ అవార్డుల‌ని అందించారు. తెలుగోడి ఖ్యాతిని విశ్వ‌వ్యాప్తం చేసిన ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ ఏకంగా 12 విభాగాల్లో నామినేషన్లను దక్కించుకోగా, ఈ చిత్రానికే అత్యధిక అవార్డులు ద‌క్కాయి. లైఫ్ అచీవ్‌మెంట్ అవార్డ్ పి. సుశీల‌కి బాల‌య్య అందించారు.


టాలీవుడ్ :


ఉత్త‌మ చిత్రం - బాహుబ‌లి 2

ఉత్త‌మ ద‌ర్శ‌కుడు - రాజ‌మౌళి (బాహుబ‌లి 2)

ఉత్త‌మ హీరో - ప్ర‌భాస్ ( బాహుబ‌లి 2)

ఉత్త‌మ హీరోయిన్‌- కాజ‌ల్ ( నేనే రాజు నేనే మంత్రి)

ఉత్త‌మ స‌హాయ న‌టుడు - ఆది ( నిన్ను కోరి)

ఉత్త‌మ స‌హాయ న‌టి - భూమిక ( ఎంసీఏ)

ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడు - ఎంఎం కీర‌వాణి (బాహుబ‌లి 2)

ఉత్త‌మ గాయ‌ని - మ‌ధుప్రియ (ఫిదా)

ఉత్త‌మ గాయ‌కుడు - కాల భైర‌వ ( బాహుబ‌లి 2)

ఉత్త‌మ విల‌న్ - రానా ( బాహుబ‌లి 2)

ఉత్త‌మ డెబ్యూ డైరెక్ట‌ర్ - సందీప్ వంగా ( అర్జున్ రెడ్డి)

ఉత్తమ డెబ్యూ యాక్ట‌ర్ - ఇషాన్ ( రోగ్‌)

ఉత్తమ లిరిక్ రైట‌ర్ - సుద్ధాల అశోక్ తేజ ( ఫిదా)

బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ - క‌ళ్యాణి ప్రియద‌ర్శ‌న్ (హ‌లో)

బెస్ట్ క‌మెడీయ‌న్ - రాహుల్ రామ‌కృష్ణ ( అర్జున్ రెడ్డి)

బెస్ట్ సినిమాటోగ్రాఫ‌ర్ - సెంథిల్ కుమార్ (బాహుబ‌లి 2)

ఎంట‌ర్‌టైన‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ - రానా ( బాహుబ‌లి 2, ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి)

బెస్ట్ యాక్ట్రెస్ లీడింగ్ రోల్ క్రిటిక్స్ - రితికా సింగ్ (గురు)

బెస్ట్ యాక్ట‌ర్ లీడింగ్ రోల్ క్రిటిక్స్ - బాల‌కృష్ణ ( గౌత‌మి పుత్ర శాత‌కర్ణి)

ఉత్త‌మ చిత్రం (క్రిటిక్స్ ) - గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి


కోలీవుడ్

ఉత్త‌మ చిత్రం - విక్ర‌మ్ వేద‌

ఉత్త‌మ ద‌ర్శ‌కుడు - అట్లీ ( మెర్స‌ల్‌)

ఉత్త‌మ హీరో - శివ కార్తికేయ‌న్‌

ఉత్త‌మ హీరోయిన్‌- న‌య‌న‌తార‌

ఉత్త‌మ స‌హాయ న‌టుడు - ఎంఎస్ భాస్క‌ర్

ఉత్త‌మ స‌హాయ న‌టి - శివ‌ద‌

ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడు - ఏ ఆర్ రెహ‌మాన్

ఉత్త‌మ గాయ‌ని - లుక్సిమి శివ‌నేశ్వ‌రి

ఉత్త‌మ గాయ‌కుడు - సిద్ శ్రీరామ్‌

ఉత్త‌మ విల‌న్ - ఎస్‌జే సూర్య‌

1926
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles