బాహుబ‌లి ఖాతాలో మ‌రో రికార్డు

Sat,January 6, 2018 10:00 AM
baahubali at 11 place

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన దృశ్య కావ్యం బాహుబ‌లి ఖాతాలో రికార్డులే కాదు, అరుదైన ఘ‌న‌త‌లు కూడా వ‌చ్చి చేరుతున్నాయి. మొన్న‌టికి మొన్న హాలీవుడ్ లో పాపులర్ వెబ్ సైట్ అయిన‌ రొటెన్ టమాటాస్ 2017 లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన వేలాది సినిమాల్లో టాప్ 10 లిస్ట్ ఎంపిక చేసింది. ఇందులో బాహుబలికి రెండోస్థానం దక్కింది. ఈ వెబ్‌సైట్ హాలీవుడ్ సినిమాల‌కి ఇచ్చే రివ్యూల‌కి గాని, రేటింగ్‌కి గాని చాలా వాల్యూ ఉంటుంది. అలాంటి వెబ్ సైట్ బాహుబ‌లికి రెండో స్థానం ఇవ్వ‌డంతో ప్ర‌తి ఒక్క తెలుగువాడు ఎంతో గ‌ర్వ‌ప‌డుతున్నాడు. ఇక తాజాగా వికీపీడియా 2017లో ప్ర‌పంచ వ్యాప్తంగా ఎక్కువ మంది చదివిన ఆర్టిక‌ల్స్‌కి సంబంధించిన జాబితాని విడుద‌ల చేసింది. ఇందులో ఇందులో ‘డెత్స్‌ ఇన్‌ 2017’ 3.73 కోట్ల వ్యూస్‌తో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు ‘డొనాల్డ్‌ ట్రంప్‌’ పేరు ఉండ‌గా, ఆయన వికీపీడియా ప్రొఫైల్‌ను 2.96 కోట్ల మంది చూశారు. 1.92 కోట్ల వ్యూస్‌తో ‘ఎలిజబెత్‌ 2’ మూడో స్థానంలో, 1.87 కోట్ల వ్యూస్‌తో ‘గేమ్స్‌ ఆఫ్‌ థ్రోన్‌’ (సీజన్‌ 7) నాలుగో స్థానంలో ఉంది.ఇక 1.46 కోట్ల వ్యూస్‌తో ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ పదకొండో స్థానాన్ని సొంతం చేసుకుంది. తెలుగు వాడి స్థాయిని పెంచిన బాహుబ‌లి సినిమా కోసం ఆన్‌లైన్లో 1.46 కోట్ల మంది వెతికారంటే ఈ సినిమా ఏ రేంజ్‌లో అంద‌రి మ‌న‌సుల‌ని గెలుచుకుందో అర్ధం చేసుకోవ‌చ్చు. ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 1700 కోట్ల వ‌సూళ్లు కొల్ల‌గొట్టిన బాహుబ‌లి 2 మూవీ త్వ‌ర‌లో చైనా, జ‌పాన్‌ల‌లో విడుద‌ల కానుంది.

2069
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles