త్వరలో ‘బాహుబలి’ మొబైల్ గేమ్ !

Thu,February 9, 2017 03:12 PM
Baahubali mobile game in development


ముంబై: టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి మూవీ బాక్సాపీస్ వద్ద కలెకన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన బాహుబలి ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది. ఈ సూపర్‌హిట్ మూవీ ఆధారంగా ఓ మొబైల్ గేమ్‌ను డిజైన్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫామ్ విల్లే, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ వంటి ప్రఖ్యాత గేమ్‌లను డిజైన్ చేసిన మార్క్ స్కాగ్స్ బాహుబలి గేమ్ రూపొందించే విషయమై డైరెక్టర్ రాజమౌళితో చర్చిస్తున్నట్లు ఫిలింనగర్ వర్గాలు పేర్కొన్నాయి. మార్క్ స్కాగ్స్ ప్రస్తుతం బాహుబలి మొబైల్ గేమ్ ను డెవలప్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. బాహుబలి ట్విట్టర్ అధికారిక పేజీ ద్వారా ఈ విషయం స్పష్టమవుతున్నది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూవీ సీక్వెల్ బాహుబలి 2 ఈ ఏడాది ఏప్రిల్ 28న విడుదల కానుంది.

1500
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles