మెల్ బోర్న్ ఫిలిం ఫెస్టివల్ లో తెలుగు సినిమాల హ‌వా

Wed,August 2, 2017 12:38 PM

ఇండియర్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్‌ మెల్ బోర్న్ 2017 వేడుక ఆగస్ట్ రెండో వారంలో మెల్ బోర్న్ లో ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో పలు ఇండియన్ సినిమాలు స్క్రీనింగ్ జరుపుకోనున్నాయి. 2016 నుండి ఇప్పటి వరకు విడుదలైన తెలుగు, తమిళం, హిందీ , మలయాళం భాషలకు సంబంధించిన ఉత్త‌మ‌ చిత్రాలు ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శితం కానున్నాయి. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్స్ కరణ్‌ జోహార్, ఐశ్వర్య రాయ్ , కొంకణ సేన్ శర్మ గెస్ట్ లుగా హాజరు కానున్నారు. అయితే తెలుగు భాషకి సంబంధించి బాహుబలి, పెళ్ళి చూపులు చిత్రాలను ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించనున్నట్టు తెలుస్తుంది. ఈ రెండు చిత్రాలు సౌత్ సినిమా స్థాయిని పదింతలు పెంచాయి. బాహుబలి సినిమా చరిత్రని తిరగరాస్తే, బెస్ట్ ఫీచర్ తెలుగు ఫిలింగా పెళ్ళి చూపులు మూవీ నేషనల్ అవార్డు అందుకుంది. ఈ చిత్రంని నార్త్ లోను రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

1275
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles