ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో అల‌రించ‌నున్న అనుష్క‌...!

Sun,September 8, 2019 11:08 AM
Baahubali star Anushka Shetty plays key role in syeraa

ఏ పాత్ర‌లోనైన ఇమిడిపోయే న‌టీమ‌ణుల‌లో అనుష్క ఒక‌రు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌తో హీరోల‌కి స‌మానంగా ఆద‌ర‌ణ పొందిన అనుష్క ప్ర‌స్తుతం నిశ్శ‌బ్దం అనే చిత్రం చేస్తుంది. ఈ సినిమా అతి త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే అక్టోబ‌ర్ 2న భారీ స్థాయిలో విడుద‌ల కానున్న సైరా చిత్రంలో అనుష్క ముఖ్య పాత్ర పోషించింద‌ని కొన్నాళ్ళుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. దీనిపై ఎలాంటి క్లారిటీ రాన‌ప్ప‌టికి అభిమానులు మాత్రం అనుష్క సినిమాలో క‌నిపించ‌నుంద‌ని విశ్వ‌సిస్తున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం సైరా చిత్రంలో అనుష్క ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో క‌నిపించ‌నుంద‌ని తెలుస్తుంది. చిరంజీవి త‌ర్వాత అంత‌టి పవ‌ర్ ఫుల్ రోల్ అనుష్క‌దే అని అంటున్నారు. పాత్ర చాలా కీల‌కం కాబ‌ట్టి ఈ విష‌యాన్ని సీక్రెట్‌గా ఉంచుతున్నార‌ట‌. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సైరా చిత్రంలో సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, త‌మ‌న్నా, న‌య‌న‌తార‌, నిహారిక‌ వంటి స్టార్ లు కూడా నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

1620
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles