మాలీవుడ్ డెబ్యూ ఇవ్వబోతున్న బాహుబ‌లి విల‌న్

Fri,June 23, 2017 04:48 PM

మ‌మ్ముట్టి ప్ర‌ధాన పాత్ర‌లో శ‌ర‌త్ సందిత్ తెర‌కెక్కిస్తున్న పెరోల్ చిత్రం ప్ర‌స్తుతం బెంగ‌ళూర్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రంతో ఫేమస్ తెలుగు యాక్ట‌ర్ ప్ర‌భాక‌ర్ డెబ్యూ ఇవ్వ‌నున్నాడు. బాహుబ‌లి సినిమాలో కాళ‌కేయ‌గా క‌నిపించి మెప్పించిన ప్ర‌భాక‌ర్ ప్ర‌స్తుతం అనేక ఆఫ‌ర్స్ అందుకుంటున్నాడు. ఈ క్ర‌మంలో మ‌మ్ముట్టి సినిమాలోను ప్ర‌త్యేక పాత్ర‌కి ఎంపిక‌య్యాడ‌ని స‌మాచారం. అజిత్ పూజాపుర జీవిత నేప‌థ్యంలో పెరోల్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తుండ‌గా జూడ్ సుధీర్ మ‌రియు జుబి నియాన్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థ్రిల్ల‌ర్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో మియా జార్జ్ ఫీమేల్ లీడ్ పోషిస్తుంది. కేర‌ళ‌లో జ‌ర‌గ‌నున్న రెండో షెడ్యూల్ లో ప్ర‌భాక‌ర్ టీంతో జాయిన్ కానున్న‌ట్టు స‌మాచారం. తెలుగులోను ప్ర‌భాక‌ర్ ఖాతాలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయ‌ని తెలుస్తుంది.

2417
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles