మగబిడ్డకు జన్మనిచ్చిన అమీజాక్సన్

Mon,September 23, 2019 05:35 PM


ప్రముఖ నటి అమీజాక్సన్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టిన మా ఏంజెల్ ఆండ్రియాకు స్వాగతం అంటూ అమీజాక్సన్ క్యాప్షన్ ఇచ్చింది. అమీజాక్సన్ ఒడిలో కుమారుడు ఉండగా..తనను జార్జ్ ముద్దాడుతున్న ఫొటోను ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది అమీ జాక్సన్. ఈ సందర్భంగా అమీజాక్సన్‌కు తన స్నేహితురాలు, నటి ఈషా గుప్తా శుభాకాంక్షలు తెలియజేసింది. అమీజాక్సన్ ప్రెగ్నెన్సీ అని తెలిసినప్పటి నుంచి ఓ వైపు జిమ్‌కు వెళ్తూ..మరోవైపు యోగాసనాలు వేస్తూ షేర్ చేసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. చివరగా రజనీకాంత్ తో కలిసి 2.ఓ చిత్రంలో నటించింది అమీజాక్సన్. అమీజాక్సన్ తన ప్రియుడు జార్జ్ పనయిటోతో కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.

View this post on Instagram

Our Angel, welcome to the world Andreas 💙

A post shared by Amy Jackson (@iamamyjackson) on1778
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles